Begin typing your search above and press return to search.

వీడియో: పాకిస్తాన్ బంకర్లపై భారత్ మెరుపుదాడి

By:  Tupaki Desk   |   13 Nov 2020 5:35 PM GMT
వీడియో: పాకిస్తాన్ బంకర్లపై భారత్ మెరుపుదాడి
X
సరిహద్దుల్లో ఉగ్రవాదులతో కుట్రలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు భారత్ గట్టి బుద్ది చెప్పింది. ఇష్టానుసారంగా భారత్ పై కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ సైనికులకు భారత్ ధీటుగా బదులిచ్చింది.

పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులను తిప్పికొడుతున్న భారత్.. తాజాగా పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను కూడా మిస్సైల్స్ తో దాడి చేసి గట్టి షాక్ ఇచ్చింది. భారత్ ఇలా సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంపై దాడి చేయడంతో పాకిస్తాన్ కు మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యింది.

తాజాగా పాకిస్తాన్ బంకర్లను భారత ఆర్మీ ధ్వంసం చేసిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. భారత ఆర్మీనే ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఆ వీడియోలో పాకిస్తాన్ భూభాగంలోని ఓ బంకర్ ను లక్ష్యంగా చేసుకొని భారత మిస్సైల్ దాడి చేసింది. మిస్సైల్ రావడంతో ఓ పాక్ సైనికుడు పారిపోతున్నది వీడియోలో రికార్డ్ అయ్యింది. మొత్తం మూడు మిస్సైల్స్ తో దాడి చేశారు.

పాకిస్తాన్ ఆయుధ సామగ్రిని కలిగిన ప్రదేశం, ఆయిల్ నిల్వల బిల్డింగ్, ఉగ్రవాదులకు సాయంగా పాక్ లాంచ్ ప్యాడ్ లను భారత ఆర్మీ మిస్సైల్స్ తో ధ్వంసం చేసింది.