Begin typing your search above and press return to search.

ప్రపంచస్థాయిలో బారత్ అవినీతి రికార్డ్ మరీ అంతనా

By:  Tupaki Desk   |   28 Jun 2016 12:14 PM IST
ప్రపంచస్థాయిలో బారత్ అవినీతి రికార్డ్ మరీ అంతనా
X
ప్రభుత్వాలు మారినా.. ప్రధానమంత్రులు మారినా పరిస్థితుల్లో సమూల మార్పులు వచ్చేస్తాయా? అంటే లేదనే చెప్పాలి. యూపీఏ సర్కారుతో పోలిస్తే.. మోడీ హయాంలో అవినీతి భారీగా తగ్గిందని.. అవినీతిని తగ్గించటంలో తాము సక్సెస్ అయినట్లుగా ప్రధాని మోడీ మొదలుకొని.. గల్లీ నేత వరకూ చెబుతుంటారు. అయితే.. మాటల్లో కనిపించే హడావుడి చేతల్లో లేదన్న మాటను తాజాగా విడుదలైన ఒక సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది.

ప్రభుత్వాల్లోని టాప్ పొజిషన్లో అవినీతి కాస్త తగ్గినా.. గ్రౌండ్ లెవల్లో మాత్రం అవినీతి.. మోసాలు ఎప్పటిలానే ఉన్నాయన్న విషయం తాజాగా మరోసారి రుజువైంది. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు గతంలో పోలిస్తే.. ఇప్పుడు అవినీతి.. మోసం పెరిగిందన్న విషయాన్ని తేల్చటం విశేషంగా చెప్పలి. మోసాలు.. అవినీతి మీద గ్లోబర్ ఫ్రాడ్ రిపోర్ట్ ఒకటి విడుదలైంది. దీని ప్రకారం ప్రపంచంలోనే భారత్ అవినీతి.. మోసాల విషయంలో థర్డ్ (మూడో) ప్లేస్ లో ఉన్నట్లుగా తేల్చారు.

గ్లోబల్ ప్రాడ్ రిపోర్ట్ ప్రకారం భారత్ లో అవినీతి మోసాలు దాదాపు 69 శాతం పెరిగినట్లుగా తేల్చింది. ప్రధానంగా కొనుగోళ్లు.. ఇతర లావాదేవీల్లో మోసాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినట్లుగా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కొలంబియా.. షహరన్ ఆఫ్రికాలు మాత్రమే భారత్ కంటే పైస్థానల్లో ఉన్నాయని..వాటి తర్వాతి స్థానం భారత్ దేనని చెబుతున్నారు. దేశంలో అవినీతి.. లంచగొండితనం కూడా భారీగానే ఉన్నట్లు తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇలాంటప్పుడు మోడీ గొప్పతనం ఏమిటి..?