Begin typing your search above and press return to search.

దుబ్బాకలో కలియుగ పాండవులు..ఏం చేస్తున్నారంటే?

By:  Tupaki Desk   |   10 Oct 2020 8:30 AM GMT
దుబ్బాకలో కలియుగ పాండవులు..ఏం చేస్తున్నారంటే?
X
ఒకే తరహా ఆలోచనలు.. భావజాలం ఉన్న వారు ఒక చోటకు చేరటం మామూలే. సోషల్ మీడియా.. ఆన్ లైన్ లోని వివిధ మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ.. తరచూ తమ అభ్రిపాయాన్ని పంచుకునే ఐదురుగురు యువకులు ఈ మధ్యన కలియుగ పాండవుల పేరుతో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో బాగా సుపరిచితమైన ఈ కలియుగ పాండువులు.. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు.

తాజాగా వీరు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఈ కలియుగ పాండవుల విషయానికి వస్తే.. వీరి నేపథ్యాలు వేరుగా ఉన్నా.. ఆలోచనలు ఒకేలా ఉండటంతో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేయాలని.. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని.. దుబ్బాక సమస్యల్ని పరిష్కరించాలన్న డిమాండ్లను తెర మీదకు తెచ్చిన వారు.. తమ నామినేషన్లను దాఖలు చేశారు.

ఈ కలియుగ పాండవుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి చెందిన బుర్ర రవితేజ.. కరీంనగర్ జిల్లాకు చెందిన కోట శ్యామ్.. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన మీసాల రాజ్యసాగర్.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మోతె నరేశ్.. ఉప్పల్ కు చెందిన రేవు చిన్న ధనరాజ్ లు ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వీరు.. తమ లక్ష్యాలు.. ఆలోచనలు ఒకేలా ఉండటంతో ఏకమై.. కలియుగ పాండవుల పేరుతో వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. నామినేషన్ తో వార్తల్లోకి వచ్చిన వారు.. ఎన్నికల పోలింగ్ నాటికి ఇంకేం హడావుడి చేస్తారో చూడాలి.