Begin typing your search above and press return to search.
విప్రోలో ఇంక్రిమెంట్లు.. టెకీల్లో చిగురిస్తున్న ఆశలు
By: Tupaki Desk | 9 Nov 2020 8:20 PM ISTభారతీయ ఐటీ దిగ్గజం విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెరుగనున్నాయి. కరోనా లాక్డౌన్ వేళ ఉద్యోగులు పనితీరుకు మెచ్చి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా ఎఫెక్ట్‌తో ఐటీరంగంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ విప్రో తట్టుకొని నిలబడింది. దీంతో ప్రస్తతం తమ కంపెనీలోని ఉద్యోగులకు వేతనాలు పెంచింది. అయితే కంపెనీలో 80 శాతం మంది ఉద్యోగులకు ఈ హైక్ వర్తించనున్నది. డిసెంబర్ 1న వాళ్లు పెరిగిన జీతాలను అందుకోనున్నారు. ప్రస్తుతానికి బీ3, దిగువ స్ధాయి ఉద్యోగులకు మాత్రమే ఇంక్రిమెంట్లు వర్తింపజేశారు. సీనియర్ ఉద్యోగుల జీతాల పెంపుపై కంపెనీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
విప్రో ప్రస్తుతం మనదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ.. ఈ సంస్థలో మొత్తం 1.85 లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు 1.5 లక్షల మంది వేతనం పెరుగనున్నది. మెరుగైన పనితీరు కనబర్చిన వారికి వేతనాలు పెంచుతున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది. కరోనా ఎఫెక్ట్‌తో కొంతకాలంగా ఐటీ కంపెనీలు వేతనాలను పెంచడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఇంక్రిమెంట్లను ఎత్తివేశాయి. మరికొన్ని కంపెనీల్లో కొత్త నియామకాలను కూడా ఆపేశారు.
కానీ ప్రస్తుతం మళ్లీ ఐటీ కంపెనీలు వేతనాలు పెంచుతుండటంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ‘కరోనా లాక్‌డౌన్‌లోనూ మా ఉద్యోగులు ఎంతో బాగా పనిచేశారు. అందుకే వారి శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తున్నాం’ అని విప్రోకు చెందిన ప్రతినిధి మీడియాకు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కరోనా సంక్షోభంలో వేతనాలు పెరగడంతో ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు.