Begin typing your search above and press return to search.

కేసీయార్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:31 AM GMT
కేసీయార్  పై పెరిగిపోతున్న ఒత్తిడి
X
కేసీయార్ పై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. జనవరి 30వ తేదీ విషయంలో కోర్టులో కూడా శుక్రవారం విచారణ జరిగింది. ఇంతకీ జనవరి 30వ తేదీ ప్రాధాన్యత ఏమిటంటే స్కూళ్ళ రీఓపెనింగ్ విషయంతో తేల్చాల్సిందే ఆరోజే కాబట్టి. తెలంగాణా వ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్ధలకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఆ పొడిగింపు జనవరి 30వ తేదీతో అయిపోతుంది.

మరి ఆ తర్వాత ప్రభుత్వం ఏమి చేయబోతోందనే విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే విషయమై హైకోర్టులో కేసు కూడా దాఖలైంది. స్కూళ్ళను తెవాల్సిందే అని ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు నానా గోల చేస్తున్నాయి. స్కూళ్ళని తెరిస్తే కేసుల సమస్య పెరిగిపోతోందని బాలల హక్కుల సంఘాలు మరోవైపు రచ్చ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోర్టులో కేసు దాఖలైంది. స్కూళ్ళు తెరవాలని చూస్తున్న ప్రభుత్వం విద్యార్ధులకు కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, పిల్లలకు వైద్య కిట్లు ఇవ్వలేదంటు కేసు పడింది.

ఇదే విషయమై హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కేసు విచారణలో మాట్లాడుతు పిల్లలకు మందుల కిట్లు నేరుగా ఇవ్వకూడదని చెప్పారు. అలా పిల్లలకే నేరుగా కిట్లను ఇచ్చేస్తే సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. మరైతే స్కూళ్ళలో ఎలాంటి జాగ్రత్తలో తీసుకున్నారని అడిగినపుడు ఆయనేమీ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది విద్యాశాఖ డైరెక్టర్. విద్యాశాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతు జనవరి 30వ తేదీనుండి విద్యాసంస్ధలను తెరవాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా తీసుకోలేదని చెప్పారు.

ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి కేసీయార్. కేసీయార్ దగ్గర ఎలాంటి రివ్యు జరగలేదట. కాబట్టి విద్యాశాఖకు ఎలాంటి క్లారిటిలేదు. ఒకవైపు స్కూళ్ళు తెరవాలని డిమాండ్లు. మరోవైపు దానికి కౌంటర్ గా పిల్లల్లో కరోనా సోకుతుందనే ఆందోళనలు. ఈ రెండింటి మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అన్న టెన్షన్. మొత్తంమీద అన్నీ వైపుల నుండి అన్నీ రకాలుగా కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. స్కూళ్ళ రీఓపెనింగ్, పిల్లల విషయంలో తీసుకున్న ముందు జాగ్రత్తలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వమని కోర్టు ఆదేశించింది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.