Begin typing your search above and press return to search.

ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరిహారంలో ఇన్‌ కం ట్యాక్స్ కట్!

By:  Tupaki Desk   |   27 May 2020 10:31 PM IST
ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరిహారంలో ఇన్‌ కం ట్యాక్స్ కట్!
X
ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు. వీరి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వీరందరికీ కోటి రూపాయల చెక్కును అందించారు. తీరా మృతుల కుటుంబాలు బ్యాంకుకు వెళ్లి చెక్కు బ్యాంకులో జమ చేసి నగదు తీసుకోవడానికి వెళ్లగా చేతికి రూ.82 లక్షలు వచ్చాయి. రూ.18 లక్షల మొత్తాన్ని పన్ను రూపంలో మినహాయించుకున్నారు. దీంతో వారి ఖాతాల్లో రూ.82 లక్షలు జమ అయింది.

అలాగే, ఈ గ్యాస్ విష ప్రభావం వల్ల 20వేల మంది వరకు బాధితులు ఉన్నారు. ఇందులో దాదాపు 10వేల మంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మిగిలిన వారికి పరిహారం ఇచ్చేందుకు సర్వే చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ నుండి జరిగిన లీకేజీ వల్ల పరిసర గ్రామాల్లోని ప్రజలకు కళ్లలో మంటలు, ఒంటిపై దురద వంటి సమస్యలు వస్తున్నాయి. కొందరికి ఊపిరి ఆడటం లేదు.

ప్రజలు ఇన్ని అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతుంటే, వారం రోజుల్లో హెల్త్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికి అది ఇప్పటికీ నెరవేరలేదని చెబుతున్నారు. మరోవైపు సర్వే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలను అడిగినా సరైన సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.