Begin typing your search above and press return to search.

మంత్రి వెలంప‌ల్లి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: బాబు డిమాండ్‌

By:  Tupaki Desk   |   22 Dec 2021 2:03 PM IST
మంత్రి వెలంప‌ల్లి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి:  బాబు డిమాండ్‌
X
తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షం టీడీపీ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగింది. ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని పార్టీ అధినేత చంద్ర బాబు అన్నారు. రామతీర్థంలో అశోక్ గజపతిరాజును అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నా రు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండ కోదండ రామాలయం పునర్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజును ప్రభుత్వం అవమానించిం ద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమ‌న్నారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అన్నారు. శంకుస్థాపన బోర్డుపై ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పేరు లేకపోవడం సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీనిపై ప్రశ్నించిన అశోక్ గజపతిరాజును వైసీపీ గూండాలు తోసివేడయం దుర్మార్గమైన చ‌ర్య అని నిప్పులు చెరిగారు. దేవాలయాల వద్ద కూడా వైసీపీ తమ వికృత రూపాన్ని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించా రు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉల్లంఘించారని, రాష్ట్రంలో రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో 200కు పైగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగాయని అన్నారు. ఏ ఘటనలోనూ దోషులను పట్టుకోలేదని దుయ్య‌బ‌ట్టారు.

``బోడికొండలోని కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఎందు కు చర్యలు తీసుకోలేదు? విజయవాడ దుర్గగుడిలో మూడు వెండి సింహాలు మాయమైనా, అంతర్వేదిలో రథం దగ్ధమైనా జగన్ రెడ్డి పాలనలో చర్యలు శూన్యం. రామతీర్థం ఆలయాన్ని ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పి మాట తప్పారు. దేవాదాయశాఖ మంత్రి బూతుల పురాణం, అవినీతిలో తేలియాడుతున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా అశోక్ గజపతిరాజును అవమానించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి`` అని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. మ‌రి దీనిపై మంత్రి వెలంప‌ల్లి ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.