Begin typing your search above and press return to search.
ఎంపీ జీవీఎల్ పై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ కార్యకర్తపై కేసు
By: Tupaki Desk | 21 Aug 2020 3:00 PM ISTబీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక టీడీపీ కార్యకర్తపై కేసు నమోదైంది. టీడీపీకి చెందిన రామయ్య అనే వ్యక్తి ‘జై తెలుగుదేశం.. టీడీపీ యూత్’ అనే పేర్లతో కొనసాగుతున్న ఫేస్ బుక్ పేజీలలో జీవీఎల్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేశాడని ఏపీ బీజేపీ నేతలు సీఐడీకి ఫిర్యాదు చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా మాట్లాడుతున్న బీజేపీ నేతలను కూడా టీడీపీ సోషల్ మీడియా వింగ్ టార్గెట్ చేస్తోందని.. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో సీఐడీ పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజినీ కూడా సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. చర్యలు తీసుకోవాలని సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుసగా ఈరోజు సోషల్ మీడియా ప్రచారంపై ఇద్దరు చేసిన ఫిర్యాదుల మేరకు రెండు కేసులు సీఐడీ నమోదు చేసింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.