Begin typing your search above and press return to search.

ఆ పార్ట్ లో ఐరన్ రాడ్డు గుచ్చి ..ఎముకలు విరిగేలా కొట్టి ,మహిళపై అత్యాచారం !

By:  Tupaki Desk   |   6 Jan 2021 4:09 PM IST
ఆ పార్ట్ లో ఐరన్ రాడ్డు గుచ్చి ..ఎముకలు విరిగేలా కొట్టి ,మహిళపై అత్యాచారం !
X
దేశంలో నిర్భయ తరహా ఘటనలకు కొదవే లేకుండాపోతుంది. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చూడటానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు, ఎన్ని నియమాలు, ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా ఆపలేకపోతున్నారు. తాజాగా నిర్భయ తరహా ఘటనే మరొకటి జరిగింది. ఓ నడివయసు మహిళను కామాంధులు కిరాతకంగా హత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న అత్యాచారపర్వాలు మహిళల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యారు. ఈనెల 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైన విషయాలు చూస్తే ఆ మహిళను ఆ కామాంధులు ఎంతలా చిత్రహింసలు చేసారో తెలుస్తుంది. మేవాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రైవేటు భాగాల్లో ఐరన్‌ రాడ్డుతో దాడి చేసి.. పక్కటెముకలు, కాలు విరిగేలా పశువుల్లా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితురాలి ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కన్నుమూసింది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కన్నుమూసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు హంత్‌ బాబా సత్యనారాయణ, అతడి అనుచరుడు వేద్‌ రాం ,డ్రైవర్‌ జస్పాల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కనుగొనేందుకు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. బదూన్‌ ఎస్ ‌ఎస్పీ సంకల్ప్ శర్మ ఘటనాస్థలిని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్టు చేసి, శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు.