Begin typing your search above and press return to search.

లెహెంగ లో రూ. కోటి 70 లక్షల డ్రగ్స్ .. ఎలా పట్టుబడ్డారంటే ?

By:  Tupaki Desk   |   11 Feb 2021 6:00 AM IST
లెహెంగ లో రూ. కోటి 70 లక్షల డ్రగ్స్ .. ఎలా పట్టుబడ్డారంటే ?
X
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలను అరికట్టడానికి సంబంధిత అధికారులు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాటికి పై ఎత్తులు వేస్తూ అధికారులకే షాకులు ఇస్తున్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారు. ఎంత పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో మాదక ద్రవ్యాలు జనబాహుళ్యంలోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అమ్మాయి డ్రెస్‌లో డ్రగ్స్‌ పెట్టి విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నారు. ఈ మేరకు డ్రెస్‌లో కోటి 70 లక్షల విలువైన డ్రగ్స్‌ పెట్టి తపాలా నుంచి ఆస్ట్రేలియాకు పంపించాలనుకున్న ప్రయత్నం ను అధికారులు తిప్పికొట్టారు. వారిని ఢిల్లీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే .. ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి అంద‌మైన లెహెంగను ఆస్ట్రేలియాకు పంపేందుకు ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలో ఉన్న విదేశీ పోస్టాఫీస్ ‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిఘా వ‌ర్గాలు పోస్టాఫీస్‌ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఆయన తీసుకువచ్చిన లెహెంగాను పరిశీలించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ డ్రెస్‌ ను నిశితంగా పరిశీలించగా అందులో రూ. కోటి 70 లక్షలు విలువ చేసే 3,900 గ్రాముల డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇది చూసి అధికారులు ఖంగు తిన్నారు. డ్రగ్స్‌ స‌ర‌ఫ‌రా చేయడానికి ప్ర‌య‌త్నించిన వ్య‌క్తిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు సరఫరా చేయాలనుకున్న డ్రగ్స్‌ చాలా ప్రమాదకరమని, కాలేయం, మూత్ర‌పిండాలు, గుండెపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయని అధికారులు తెలిపారు. మొత్తం 7 లెహెంగాలను స్వాధీనం చేసుకున్నారు.