Begin typing your search above and press return to search.

ఒక్క ఇండియాలోనే అలా ... దాన్ని మార్చాలనుకుంటున్నా : మరోసారి డీకే హాట్ కామెంట్స్ !

By:  Tupaki Desk   |   8 July 2021 5:30 AM GMT
ఒక్క ఇండియాలోనే అలా ...  దాన్ని మార్చాలనుకుంటున్నా : మరోసారి డీకే హాట్ కామెంట్స్ !
X
ఈ మధ్యనే కామెంటేటర్‌ గా మారి అందరి మన్ననలు పొందుతున్న టీమిండియా వెటరన్ క్రికెట్ దినేశ్ కార్తీక్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మద్యే భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్‌ తో కామెంట్రీ షురూ చేసిన డీకే తనదైన వ్యాఖ్యానంతో అందర్ని ఆకట్టుకున్నాడు. దిగ్గజ వ్యాఖ్యతల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే , దినేశ్ కార్తీక్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా దినేశ్ కార్తీక్ చేసిన వ్యాఖ్యనంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో .. బ్యాట్స్‌మెన్‌, బ్యాట్ల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ గురించి చెప్తూ .. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్స్‌మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేవి రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్‌మెన్‌ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా కనిపిస్తాయి అని దినేశ్‌ కార్తీక్ సరదాగా చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా విమర్శలు చేయడంతో అందరికి క్షమాపణలు చెప్పాడు.

తాజాగా మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఒక్క ఇండియా లోనే వ్యాఖ్యానాన్ని రిటైర్మెంట్‌ తర్వాత చేసే పనిగా భావిస్తారని కార్తీక్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ వ్యాఖ్యాతగా క్రికెట్‌ గురించి నాకు తెలిసింది మాట్లాడాలనుకున్నా. బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌ బాల్‌ టెన్నిస్ వంటి ఇతర క్రీడల్లో ఆటగాళ్లు తాము ఆటకు దూరంగా ఉన్నప్పుడు వాఖ్యానం చేస్తుంటారు. శ్రీలంక, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ లో కూడా జేమ్స్‌ అండర్సన్‌ కూడా బీబీసీ కోసం వ్యాఖ్యాతగా అవతారం ఎత్తాడు. ప్రస్తుత ఆటగాళ్లు వ్యాఖ్యానం చేయడం ప్రపంచ వ్యాప్తంగా మాములు విషయమే. ఒక్క ఇండియా లోనే అది రిటైర్మెంట్‌ తర్వాత చేసే పనిగా భావిస్తారు. అలాంటి ధోరణిని మార్చాలనుకుంటున్నా. నేను జట్టులో లేనప్పుడు సంతోషంగా కామెంట్రీ చెబుతా అని చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ కు తోడుగా దినేశ్‌ కార్తీక్‌ వ్యాఖ్యానం చేసిన సంగతి తెలిసిందే. దానిపై మాట్లాడుతూ..వ్యాఖ్యానంలో సునీల్‌ గవాస్కర్‌ చాలా టిప్స్ చెప్పారు. అలాగే , సన్నీతో ఉన్న సమయంను బాగా ఎంజాయ్ చేశా. వ్యాఖ్యానంలో చాలా ఫన్ ఉంది. నాజర్ హుస్సేన్, మైఖేల్ ఆర్థర్ వంటి వారి పక్కన కూర్చుని కామెంటరీ చెప్పడం గౌరవంగా భావిస్తున్నా అని తెలిపారు.

దినేష్ కార్తీక్‌ ఇండియా తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు. ఎంఎస్ ధోనీ కంటే ముందే ఇంటర్నేషనల్ క్రికెట్‌ లోకి దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ , ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మాత్రం కొనసాగలేకపోయాడు. ధోనీ పూర్తిగా వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాట్స్‌ మెన్‌ గా మాత్రమే టీమ్‌ లోకి ఎంపికవుతూ వచ్చిన కార్తీక్ ఆ తరవాత టీం లో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌ లో తమిళనాడు తరఫున నిలకడగా ఆడుతూ వచ్చిన కార్తీక్.. 2018 నిదహాస్ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత ఒక్కసారిగా హీరో అయ్యాడు. తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌కి కూడా భారత సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే , ఆ ప్రపంచ కప్ లో అంచనాల్ని అందుకోలేకపోవడంతో మళ్లీ దూరమైయ్యాడు. త్వరలో బ్యాక్ టు బ్యాక్ టీ20 ప్రపంచకప్‌ లు జరగబోతున్నాయి. ఈ రెండు మెగా టోర్నీల్లో ఆడాలని ఆశిస్తున్నా, అందులో భాగం కావడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నా అని తెలిపాడు.