Begin typing your search above and press return to search.

మరో వివాదంలో బండ్ల గణేష్

By:  Tupaki Desk   |   21 March 2022 6:18 AM GMT
మరో వివాదంలో బండ్ల గణేష్
X
బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే ఆయన వచ్చింది సినిమాల గురించి కాదు.. ఈసారి ఆయన వ్యక్తిగత జీవితంలో ఒకవివాదంలో ఇరుక్కున్నారు. తెరపైకి ఇప్పుడు పుప్పాల గూడ హనుమాన్ దేవాలయం స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఆ భూముల వివాదంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు చుట్టుకుంది.ఈ ఆలయ భూములను బండ్ల గణేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆలయ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ సంకటహర హనుమాన్ దేవాలయ భూముల విషయంలో ఇరువర్గాల మధ్య కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. ఆలయానికి సంబంధించిన భూముల్లోకి సినీ నిర్మాత బండ్ల గణేష్ తన అనుచరులతో వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆలయ భూముల స్థలాన్ని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇక ఈ భూములు నావి అనేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని బండ్ల గణేష్ అంటున్నారు. ఆ స్థలంలో ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని.. దాన్ని అడ్డుకునేందుకు పోలీసుల సహాయంతో కలిసి అక్కడికి వచ్చానని బండ్ల గణేష్ క్లారిటీ ఇస్తున్నారు.హిందువులకు, దేవాలయాలకు తాను ఎప్పుడూ వ్యతిరేకిని కాను అని.. తన భూమిని తాను కాపాడుకునేందుకే వచ్చానని అంటున్నారు బండ్ల గణేష్.

ఇక చాలా మంది దురాక్రమణదారులు ఆలయ భూముల కబ్జాకు ప్రయత్నించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. హనుమాన్ టెంపుల్ కు 3 ఎకరాల స్థలం ఉందని రికార్డుల్లో ఉందని..అది మా దగ్గర కూడా ఉందని.. చాలా మందికి ఇవి చూపించానని.. తాజాగా బండ్ల గణేష్ వచ్చి భూమి తనదేనని దౌర్జన్యం చేస్తున్నాడని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరి ఈ భూమి ఎవరిది? బండ్ల గణేష్ దా? ఆలయానిదా? అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.