Begin typing your search above and press return to search.

1947లో రూపాయి - డాలర్ సమానమే !

By:  Tupaki Desk   |   1 Aug 2019 11:10 AM GMT
1947లో రూపాయి - డాలర్ సమానమే !
X
స్వాతంత్ర్యం వచ్చిన 1947లో భారత కరెన్సీ రూపాయి విలువ, అమెరికా కరెన్సీ యూఎస్ డాలర్ విలువ సమానం. 72 ఏళ్ల తరువాత ఇప్పుడు 2019తో 73వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడానికి దేశం సిద్ధమవతున్నవేళ యూఎస్ డాలర్‌ తో రూపాయి మారకం విలువ రూ.69కి పైగా ఉంది. అంటే డాలరుతో సమానంగా ఉండే రూపాయి క్రమంగా క్షీణిస్తూ ఈ ఏడు దశాబ్దాల్లో భారీగా పతనమైనట్లు అర్థమవుతోంది.

అయితే 1947లో రూపాయి విలువ డాలర్‌ తో సమానంగా ఉండడానికి కారణాలున్నాయి. అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన దేశం కావడంతో బాలెన్స్‌ షీట్‌ లో విదేశీ అప్పులేవీ లేకపోవడమే. దాదాపు 1951 వరకు అదే పరిస్థితి కొనసాగింది. కానీ.. 1951లో పంచవర్ష ప్రణాళిక ప్రారంభించిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేయడం మొదలయ్యాయి. విదేశాల నుంచి అప్పులు తేవడంతో రూపాయి విలువ డాలరుకు రూ.4కి చేరింది. అక్కడి నుంచి అప్పులు పెరుగుతున్నకొద్దీ రూపాయి విలువ తగ్గుతూ వచ్చింది.

అమెరికాతో పోలిస్తే మన ఎగుమతులు తక్కువ కావడం.. తయారీ రంగం మనకంటే అమెరికాలో బలంగా ఉండడం.. అభివృద్ధి కోసం మనం అప్పులు చేయడంతో విదేశీ మారకద్రవ్యం విషయంలో అమెరికాతో పోటీ పడలేని పరిస్థితి. ఈ కారణంగా క్రమంగా రూపాయి విలువ తగ్గుతూ వచ్చింది. రూపాయి పతనమైతే చిన్న, మధ్య తరగతి ప్రజానీకంపై పెనుభారం పడుతుంది. భారత్‌ దిగుమతి చేసుకునే ప్రతీ సరుకూ ఖరీదైపోతుంది. చమురు ధరలు పెరగుతాయి. చమురు ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. రూపాయి పతనం విదేశీ విద్యపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకు తలిదండ్రులు ప్రస్తుతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

1947లో డాలరు, రూపాయి సమాన విలువ కలిగి ఉండగా.. 1952లో డాలరుకు రూ.4.75 రూపాయలైంది. 1966లో అది రూ.7.10.. 1975లో రూ.8.41... 1986లో రూ.12.60.. 1966లో రూ.35.66.. 2006లో రూ.46.. 2014లో మోదీ గద్దెనెక్కే నాటికి రూ.61.. ప్రస్తుతం రూ.69 వద్ద ఉంది.

మోదీ తొలిసారి అధికారం చేపట్టేనాటికి రూ.61 వద్ద ఉన్న రూపాయి విలువ ప్రస్తుతం రూ.69 వద్ద ఉందంటే ఈ అయిదేళ్ల కాలంలో నికరంగా రూ.8 పెరిగినట్లు లెక్క. మోదీ కంటే ముందు యూపీయే-2 పాలనలోని అయిదేళ్ల కాలంలో రూ.13 పెరిగింది.

1900 సంవత్సరంలో రూపాయికి 13 డాలర్లు
స్వాతంత్ర్యానికి ముందు 1900 సంవత్సరంలో ఒక రూపాయికి 13 డాలర్ల విలువ ఉండేదని చెబుతారు. కానీ, ఇది నిజం కాదు. పైగా . అదంతా పరోక్ష లెక్కే. అందుకు కారణం స్వాతంత్ర్యానికి పూర్వం డాలరుకు, రూపాయికి పోలికే లేదు. అప్పుడు బ్రిటిష్ పాలన ఉండడంతో భారత్‌ కు సంబంధించిన విదేశీ వ్యాపారమంతా కూడా బ్రిటిష్ కరెన్సీ అయిన పౌండ్లలోనే సాగేది. 1927 నుంచి 1966 వరకు ఒక పౌండ్‌ కు రూ.13 విలువ ఉండేది. ఆ తరువాత 1966లో భారత ప్రభుత్వం తొలిసారి రూపాయి విలువను అధికారికంగా తగ్గించింది. ఒక రూపాయికి 0.133 డాలర్లుగా నిర్ణయించింది. అంటే.. డాలరుకు రూ.7.5 అన్న మాట.