Begin typing your search above and press return to search.
వీరమాచినేని వీరంగం
By: Tupaki Desk | 28 Aug 2018 7:00 AM ISTవీరమాచినేని డైట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వీరమాచినేని రామకృష్ణ తన ఆహార సిద్దాంతాన్ని కాదన్న వారిపై ఒంటి కాలిపై లేస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన కొబ్బరినూనెతో కలిగే నష్టాలపై వైద్యులు - శాస్త్రవేత్తల పరిశోధనలనూ ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. హార్వర్డ్ పరిశోధకులు తాజాగా కొబ్బరినూనె వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి హృద్రోగాలకు కారణమవుతుందంటూ తమ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పరిశోధకురాలు కొబ్బరినూనెను విషంతో పోల్చారు. అలా కొబ్బరినూనెను విషంతో పోల్చిన పరిశోధకురాలిపై వీరమాచినేని వీరంగమాడారు.. ఆమెను అప్పలమ్మంటూ వ్యాఖ్యలు చేశారు.. ఆమెనే కాకుండా ఆ వార్త ప్రసారం చేసిన - ప్రచురించిన మీడియానూ ఆయన తిట్టిపోశారు.
కొబ్బరినూనెపై పరిశోధనల పేరుతో జరుగుతున్న ప్రచారం వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. కొబ్బరి నూనె విషమైతే మరి దేవుడికి కొబ్బరిని నైవేద్యంగా ఎందుకు పెడుతున్నామని వీరమాచినేని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రెండు నెలల క్రితం అమెరికాలోని ఓ అప్పలమ్మ కొబ్బరి నూనె విషమని చెప్పింది.. 50 రోజుల తరువాత మనవాళ్లు అదేదో నిజమని వార్తలు రాయడం - ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
కేరళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కొబ్బరినూనె వాడుతారని.. అరబ్ దేశాలు - కొరియా - చైనా వంటి దేశాలలో తల్లిపాల తరువాత చిన్న పిల్లలకు కొబ్బరినూనెతో తయారైన ఆహారాన్నే ఇస్తారని వీరమాచినేని చెప్పారు. ఇంతమంది వాడుతుండగా పనీపాట లేక ఒక అప్పలమ్మ ఏదో చెబితే దానిని మీడియా భూతద్దంలో చూపిస్తోందంటూ మీడియాపై మండిపడ్డారు. అందరూ వంటల్లో వాడుతున్న రీఫైండ్ ఆయిల్స్ వల్లే ఆరోగ్యం పాడవుతోందని.. అందులో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. కొబ్బరినూనె వల్ల ఎలాంటి నష్టం కలగదని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా వీరమాచినేని డైట్ ను తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫాలో అవుతున్నప్పటికీ దానిపై వివాదాలూ అంతేస్థాయిలో ఉంటున్నాయి. డయాబెటిక్ రోగులు ఆయన డైట్ వాడి ఆరోగ్యం పాడుచేసుకున్నారన్నా ఆరోపణలున్నాయి. పలువురు వైద్యులూ ఆయన వాదనలను శాస్త్రీయంగా ఖండిస్తున్నారు.