Begin typing your search above and press return to search.

అనైతిక బంధంః పెళ్ల‌యిన మ‌హిళ‌.. పెళ్లికాని యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏమైంది?

By:  Tupaki Desk   |   6 March 2021 6:00 AM IST
అనైతిక బంధంః పెళ్ల‌యిన మ‌హిళ‌.. పెళ్లికాని యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏమైంది?
X
వివాహేత‌ర సంబంధాలు ఏ రూపంలో కొన‌సాగినా.. అవి చాలా వ‌ర‌కు విషాదంగానే అంత‌మ‌వుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌లోనూ అదే జ‌రిగింది. అయితే.. ఇందులో శారీర‌క‌ వ్యామోహం క‌న్నా.. డ‌బ్బు అంశ‌మే ప్ర‌ధానంగా క‌నిపిస్తుండ‌డం విశేషం. క‌ర్నాట‌క‌లో కొన‌సాగిన ఈ తంతు ఓ కుటుంబ నాశ‌నానికి కార‌ణం కాగా.. ఓ యువ‌కుడి జీవితాన్ని జైలు పాలు చేసింది.

మైసూరులోని ఐటీసీ ఫ్యాక్ట‌రీలో కాంట్రాక్టు కార్మికురాలిగా ఓ మ‌హిళ ప‌నిచేస్తోంది. ఆమెకు అప్ప‌టికే పెళ్ల‌య్యింది. ముగ్గురు పిల్ల‌లు కూడా. అదే ఫ్యాక్ట‌రీలో డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్నాడు ఓ యువ‌కుడు. అత‌నికి పెళ్లి కాలేదు. ఇద్ద‌రి మ‌ధ్యా ఏర్ప‌డిన ప‌రిచ‌యం అనైతిక బంధానికి బాటలు వేసింది. ఇద్ద‌రూ జాలీగా గ‌డుపుతుంటేవాడు. ఈ క్ర‌మంలో ఆమెను సంతోష పెట్ట‌డానికి బ‌హుమ‌తులు ఇస్తూ ఉండేవాడు ఆ యువ‌కుడు. ఇదేదో బాగుంద‌ని అనుకుంది స‌ద‌రు మ‌హిళ‌. అప్పటి నుంచి అత‌న్ని డ‌బ్బుకోసం పీడించేది.

అత‌డి సంపాద‌న మొత్తం త‌న‌కే ఇవ్వాల‌ని.. త‌న‌కు తెలియ‌కుండా ఎక్క‌డికీ వెళ్లొద్ద‌ని.. ఎవ‌రితోనూ మాట్లాడ వ‌ద్ద‌ని ఇలా కండీష‌న్లు పెడుతుండేది. ఈ ప‌రిస్థితి రానురానూ మ‌రింత‌గా తీవ్ర‌మైంది. చివ‌ర‌కు ఎంత వ‌ర‌కూ వెళ్లిందంటే.. నువ్వు ఎవ్వ‌ర్నీ పెళ్లి చేసుకోవ‌ద్దు.. నాతోనే ఉండాలి.. అంటూ మాట్లాడ్డం మొద‌లుపెట్టింది స‌ద‌రు మ‌హిళ‌. ప్ర‌తీ దానికి ఆంక్ష‌లు విధిస్తుండ‌డంతో అత‌డు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యేవాడు. ఇక‌, ఎలాగైనా ఆమె బారి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని నిర్ణ‌యంచుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే.. గ‌త ఫిబ్ర‌వ‌రి 23న ఒక చోట‌కు వెళ్లాలంటూ స‌ద‌రు మ‌హిళ‌ను తీసుకెళ్లాడా యువ‌కుడు. హిమ్మాపు అనే గ్రామం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేసి, వ‌చ్చి త‌న‌ప‌ని తాను చేసుకుంటున్నాడు. అయితే.. స‌ద‌రు మ‌హిళ క‌నిపించ‌క‌పోవ‌డంతో భ‌ర్త పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. చివ‌ర‌కు వివాహేత‌ర బంధం విష‌యం తెలుసుకొని స‌ద‌రు యువ‌కున్ని విచారించారు. అస‌లు విష‌యం తేల‌డంతో అరెస్టు చేశారు. ఈ విధంగా.. వీరి వివాహేత‌ర సంబంధం అటు కుటుంబాన్ని నాశ‌నం చేసింది.. స‌ద‌రు మహిళ ప్రాణాలు బ‌లిగొంది.. ఇటు యువ‌కుడిని జైలుపాలు చేసింది.