Begin typing your search above and press return to search.

దావూద్ తోనే సంబందాలుంటే...

By:  Tupaki Desk   |   27 July 2015 8:37 AM GMT
దావూద్ తోనే సంబందాలుంటే...
X
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లకు బుకీలతో సంబంధాలు ఉన్నాయని, పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని ఫిక్సింగ్ కి పాల్పడ్డారని అభియోగాలు నమోదవడం... వీరితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ పేర్లను కూడా ఢిల్లీ పోలీసులు ఈ కేసులో చేర్చడం... దీనిపై స్పాట్ పిక్సింగ్ వ్యవహారం బయటకు రాగానే బీసీసీఐ వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడం... తాజాగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ తో సహా 16మంది క్రికెటర్లను నిర్దోషులుగా కోర్టు ప్రకటించడం... తెలిసిందే!

ఐతే కోర్టు తీర్పు వెలువడిన అనంతరం స్వస్థాలనికి వచ్చిన శ్రీశాంత్ కు కొచ్చి విమానాశ్రయంలో స్నేహితులు, బంధువులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు! అనంతరం మాట్లాడిన శ్రీశాంత్... దావూద్ తో తనకు ఎలాంటి సంబందాలు లేవని, కనీసం పరిచయం కూడా లేదని తెలిపాడు! నిజంగా దావూద్ తో సంబందం కానీ, పరిచయం కానీ ఉండిఉంటే... క్రికెటర్ అయ్యిఉండకపోయేవాడినని చురకలేశాడు! వారితోనే సంబందాలుంటే... ఏ దుబాయ్ లోనో మరోచోటో ఉండేవాడిని కానీ... ఇలా ఉండేవాడిని కాదని అన్నాడు!

ఈ సమయంలో కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు అండగా ఉన్న కేరళ ప్రజలకు, అభిమానులకు శ్రీశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు! ఇదే సమయంలో స్పాట్ ఫిక్సింగ్ వల్ల ముగిసిపోయిన తన కెరీర్ మళ్లీ పునరుద్ధరించుకుంటున్నానని తెలిపాడు! కోర్టు నిర్దోషిగా ప్రకటించన ఉత్సాహంలో ఆదివారం కాసేపు నెట్ ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నాడు ఈ కేరళ స్పీడ్ స్టార్! అలాగే తనపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తొలగిస్తుందనే ఆశాభావాన్ని కూడా శ్రీ వ్యక్తం చేశాడు!