Begin typing your search above and press return to search.

కరోనా పోయినా అనారోగ్యం తప్పట్లేదు.. ఎందుకలా..?

By:  Tupaki Desk   |   9 Oct 2020 2:15 PM IST
కరోనా పోయినా అనారోగ్యం తప్పట్లేదు.. ఎందుకలా..?
X
ప్రస్తుతం కరోనాను చాలా మంది లైట్​గా తీసుకుంటున్నారు. మొదట్లో ఉన్న భయం ఇప్పుడు లేదు. మరణాలు రేటు తక్కువగా, రికవరీ రేటు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే కరోనా వచ్చి కోలుకున్నాక కూడా కొంతమందికి తీవ్ర అనారోగ్యం కలుగుతున్నది. బాడీ పెయిన్స్​, తలనొప్పి, అప్పడప్పడు జ్వరం, నెలల తరబడి అలసట, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తదితర లక్షణాలతో బాధ పడుతున్నారు.

అయితే ఎందుకు అలా జరుగుతుంది. ఈ విషయం పై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. అయితే నెలల తరబడి కరోనా అనారోగ్యాన్ని కలిగిస్తుంటే దాన్నే ‘దీర్ఘకాలిక కోవిడ్​’ (లాంగ్​కోవిడ్​) అంటున్నారు. ప్రస్తుతం ఇటువంటి పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. లాంగ్​కోవిడ్​కు ఇప్పటి వరకు వైద్య పరమైన నిర్వచనాలు లేవు. అయితే లక్షణాలు కూడా పేషెంట్లందరిలోనూ ఓకే విధంగా లేవు. కొంతమంది తొందరగానే కోలుకుంటున్నారు. ‘నాకు కరోనా వచ్చి తగ్గింది. అయినప్పటికీ నేను మునుపటి లాగా సాధారణం గా లేను..తరచూ జ్వరం వస్తుంది. అని హైదరబాద్​కు చెందిన ఓ వ్యక్తి అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది లాంగ్​ కోవిడ్​ తో బాధ పడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్‌కు చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్ట్రైన్ చెప్పారు. ఇటీవల ఈ లాంగ్​ కోవిడ్​ వ్యాధిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. రోమ్​కు చెందిన ఓ ఆస్పత్రిలో 143 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకున్నారు. కాగా వారిలో 87 శాతం మంది లాంగ్​ కోవిడ్ ​తో ఇప్పటికీ బాధ పడుతున్నారు. తరుచూ ఏదో ఓక అనారోగ్యం తో బాధ పడుతున్నారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌ లో ఓ కథనాన్ని ప్రచురించారు.

నెగిటివ్​ వచ్చినా.. శరీరం లో వైరస్​

కరోనా నెగిటివ్​ వచ్చినప్పటికీ శరీరంలో కొంత మోతాదులో కరోనా వైరస్​ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది మళ్లీ క్రియాశీలంగా మారి ఇబ్బందులు కలిగిస్తుందని చెబుతున్నారు. ఒక వేళ పేగుల్లో కరోనా వైరస్​ ఉంటే అది విరేచనాలకు దారి తీయచ్చు. నరాల్లో గనక వైరస్​ ఉంటే వాసన కోల్పోయే ప్రమాదం ఉన్నదని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ తెలిపారు. లాంగ్​ కోవిడ్​ లక్షణాలు ఉన్నవారు ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అనసవరం గా ఒత్తిడికి గురి కావద్దని.. ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.