Begin typing your search above and press return to search.

హైదరాబాద్​ బిర్యానీ తిని అస్వస్థత.. ! ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆస్పత్రిపాలు..!

By:  Tupaki Desk   |   7 Feb 2021 11:40 AM IST
హైదరాబాద్​ బిర్యానీ  తిని అస్వస్థత.. ! ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆస్పత్రిపాలు..!
X
హైదరాబాద్​ బిర్యానీ తిని ఓ కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. మల్కాజ్​గిరికి చెందిన ఓ కుటుంబం .. ఇటీవల ఆనంద్‌ బాగ్‌ లోని 'మజ్లిస్‌ అల్‌ మండి' లో బిర్యానీ తిన్నారు. వివాహ వార్షికోత్సవం ఉండటంతో ఆ కుటుంబం మొత్తం కలిసి.. ఓ హోటల్​కు వెళ్లింది. బిర్యానీ తిన్నాక కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. ఆ కుటుంబంలోని ఐదుగురు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే ఫుడ్​ పాయిజన్​ అయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.వెంటనే సదరు హోటల్​పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్​ అంటే టక్కున గుర్తుకు వచ్చేది బిర్యానీ. అంతలా బిర్యానీ ఫేమస్​ అయ్యింది. సొంత పనుల కోసం వివిధ పట్టణాల నుంచి నగరానికి వచ్చిన వాళ్లు హైదరాబాద్​ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు.

హైదరాబాద్​లో ఉండేవాళ్లు కూడా వారానికోసారైనా రెస్టారెంట్​ కు వెళ్లి బిర్యానీ తింటుంటారు. నగరంలో ఉన్న ప్రతి రెస్టారెంట్​లో బిర్యానీ ఉంటుంది. అటువంటింది ఇప్పుడు హైదరాబాద్​లోని ఓ ప్రముఖ రెస్టారెంట్​లో బిర్యానీ ఫుడ్​ పాయిజన్​ కావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంపై హోటల్​ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.