Begin typing your search above and press return to search.

ఏపీ బ‌స్సులను తెలంగాణ‌లో అడ్డుకుంటార‌ట‌

By:  Tupaki Desk   |   13 Jun 2017 3:47 PM GMT
ఏపీ బ‌స్సులను తెలంగాణ‌లో అడ్డుకుంటార‌ట‌
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్ సంచ‌ల‌న హెచ్చ‌రిక జారీచేశారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డితో పాటు పలువురు నాయకులతో కలిసిన శ్రీనివాస్‌ గౌడ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ప్రైవేట్ బస్సుల మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్ సర్క్యులర్ ప్రైవేటు బస్సుల యాజమాన్యాల దుర్మార్గాలకు నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందినటువంటి బస్సులు - లారీలు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటామని ప్ర‌క‌టించారు. ఈ మేరకు మూడు, నాలుగు రోజుల్లో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని శ్రీ‌నివాస్‌గౌడ్‌ తెలిపారు.

బ‌స్సుల‌కు అనుమ‌తుల ఇచ్చే విష‌యంలో నిబంధ‌న‌ల‌కు నీళ్లు వ‌దులుతున్నార‌ని శ్రీ‌నివాస్ గౌడ్ ఆరోపించారు. క‌నీసం బస్సులు ఉన్నాయో లేదో చూడకుండానే పర్మిషన్లు ఇస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయంపై రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌ శర్మను కలిసి సమస్యను విన్నవించినట్లు చెప్పారు. రేపు తమ బస్సుల నంబర్లు పంపిస్తామని అరుణాచల్‌ ప్రదేశ్ అధికారులు చెప్పారన్నారు. కాగా అసలు రాష్ట్రంలో అరుణాచల్ బస్సులు నడిచేందుకు వీలు లేదన్నారు. తెలంగాణకు ఎన్ని ఏసీ బస్సులు వస్తున్నాయో... తెలంగాణ నుంచి ఏపీకి అన్ని బస్సులు వెళ్లాలన్నారు. సింగల్ పర్మిట్ విధానంపై ఏపీ స్పందించడం లేదని తెలిపారు. కేవలం తెలంగాణకు మాత్రమే ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/