Begin typing your search above and press return to search.

విజ‌య్..త‌మిళ‌నాడు సీఎం అయ్యాడు!

By:  Tupaki Desk   |   4 Jan 2020 5:43 AM GMT
విజ‌య్..త‌మిళ‌నాడు సీఎం అయ్యాడు!
X
త‌మిళ హీరో విజ‌య్.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యాడు! అయితే ఇది నిజం కాదు, ఇప్ప‌టికిప్పుడు విజ‌య్ సొంతం గా పార్టీ పెట్టేసి, త‌మిళ‌నాడు లో ఎన్నిక‌ల్లో నెగ్గేసి ఆ రాష్ట్రానికి సీఎం కాలేదు. వాస్త‌వానికి త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ఇప్పుడ‌ప్పుడే లేవు. మ‌రో రెండేళ్ల‌లోపే అవి జ‌ర‌గ‌బోతూ ఉన్నాయి. అయితే ఆ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన‌డానికి విజ‌య్ ఇంకా రాజ‌కీయ పార్టీ ఏదీ పెట్ట‌లేదు. ఈ త‌మిళ హీరో రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. వస్తారు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

వాటిలో వేటి తో సంబంధం లేకుండా.. విజ‌య్ త‌మిళ‌నాడుకు సీఎం అయి పోయాడు. అది అభిమానుల పోస్ట‌ర్ల‌లో. త‌మ అభిమాన హీరో త‌మిళ‌నాడు సీఎం అంటూ పోస్ట‌ర్లు వేస్తున్నారు విజ‌య్ ఫ్యాన్స్. ఇక్క‌డ సీఎం అంటే వేరే నిర్వ‌చ‌నం ఉంది. అదేమిటంటే.. క‌లెక్ష‌న్ మాస్ట‌ర్ అట‌!

ప్ర‌స్తుతం విజయ్ మాస్ట‌ర్ అనే సినిమా లో న‌టిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌లే విడుద‌ల అయ్యింది. ఇలా మాస్ట‌ర్ సినిమాలో న‌టిస్తున్న విజ‌య్ ను క‌లెక్ష‌న్ మాస్ట‌ర్ గా అభివ‌ర్ణిస్తున్నారు అత‌డి ఫ్యాన్స్. ఆ క‌లెక్‌ష‌న్ మాస్ట‌ర్ కు షార్ట్ ఫామే సీఎం. త‌మిళ‌నాడు క‌లెక్ష‌న్ మాస్ట‌ర్ కాస్తా త‌మిళ‌నాడు సీఎం అయ్యాడ‌న‌మాట‌! ఇదీ క‌థ‌.

అభిమానులు అత్యుత్సాహం కొద్దీ త‌మిళ‌నాడుకు విజ‌య్ సీఎం అయిపోయాడంటూ పోస్ట‌ర్లు వేసుకుంటూ ఉన్నారు. ఎవ‌రి ఆనందం వారిది. ఒక తెలుగు సినిమాలో సీఎం అంటూ ఎంఎస్ నారాయ‌ణ కామెడీ సీన్లు ఉంటాయి. సీఎం అంటూ త‌న పేరును ప్ర‌మోట్ చేసుకునే ఎమ్మెస్ నారాయ‌ణ అస‌లు పేరు చంద్ర‌మౌళి ఆ సినిమాలో. చంద్ర‌మౌళిని సీఎం అని సంబోధిస్తూ బ్ర‌హ్మానందానికి మ‌ల్లిఖార్జున రావు చెప్ప‌డం.. ఆ సినిమా చివ‌ర్లో సీఎం అంటే చంద్ర‌మౌళి అంటూ బ్ర‌హ్మానందానికి అర్థం కావ‌డం.. అదంతా ఒక కామెడీ ఎపిసోడ్. ఇప్పుడు విజ‌య్ ఫ్యాన్స్ తీరు కూడా ఆ కామెడీని త‌ల‌పింప‌జేస్తోంది.