Begin typing your search above and press return to search.
ఐఐటీ సీటు ఇంక అందని ద్రాక్ష కాదు
By: Tupaki Desk | 26 Nov 2016 2:16 PM ISTఏఐసీటీఈ నిబంధనలు, యూనివర్సిటీల అఫిలియేషన్ల విధానంతో సతమతమవుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వచ్చే నాలుగేళ్లలో అంటే 2020 నాటికి దేశంలోని అన్ని ఐఐటీల్లో లక్ష సీట్లను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న నాసిరకం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఏఐసీటీఈ నిబంధనలు, యూనివర్సిటీల అఫిలియేషన్ల విధానంతో సతమతమవుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు ఈ నిర్ణయం ఉరుములేని పిడుగులా మారనుంది.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి మహేంద్రపాండే మాట్లాడుతూ వచ్చే నాలుగు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని (2020 నాటికి) దేశంలో లక్ష ఐఐటీ సీట్లను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో ఈ అంశంపై దేశవ్యాప్త చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 19 ఐఐటీల్లో 10,006 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మంత్రి ప్రకటన ప్రకారం మరో 90వేల సీట్లు అందుబాటులోకి రాబోతున్నయి. ప్రస్తుతమున్న ఐఐటీల్లో ఇంత పెద్ద మొత్తంలో సీట్లను చేర్చే అవకాశం లేనందున కొత్త ఐఐటీ క్యాంపస్‌లను నెలకొల్పుతారని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోనూ, రాష్ట్రంలో పెరుగుతున్న ఐటీ, ఉత్పత్తి పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో ఐఐటీలకు ప్రాధాన్యం పెరుగనుంది. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో లక్ష సీట్లు అందుబాటులోకివస్తే పట్టణ ప్రాంత విద్యార్థులతోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఐఐటీ బాటపట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు ఇప్పటికే వేల సంఖ్యలో వాటిలో అడ్మిషన్లు పొందుతున్నారు. లక్ష సీట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చిన వెను వెంటనే ఇంటర్ పూర్తి చేసిన మెరిట్ విద్యార్థులంతా.. ఐఐటీల వైపు మొగ్గుచూపుతారని సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు సహజమరణం పొందడం ఖాయమని పలువురు సీనియర్ ప్రొఫెసర్లు స్పష్టం చేస్తున్నారు.
ఐఐటీల్లో లక్ష సీట్ల అందుబాటులోకి తీసుకురావడం వల్ల.. ఆ మేరకు టీచింగ్ సమస్యలు ఉత్పన్నమవుతుందేమోనన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే, వసతి సదుపాయాలు-టీచింగ్ సమస్య- నిధులు-కనీస మౌలిక వసతి సదుపాయాలు, ప్లేస్‌మెంట్ వంటి అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాతే లక్ష సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోది. దీనిపై రెండు నెలల క్రితం జరిగి 50వ ఐఐటీ మండలి సమావేశంలో కూడా ఈ మేరకు చర్చ జరిగినట్లు సమాచారం. ఐఐటీల్లో ప్రస్తుతం పది వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో వాటిలో లక్ష సీట్లు పెంచడం సాధ్యమా..? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్లలో లక్ష సీట్ల పెంపు అసాధ్యమేమీ కాదని ఐఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్ష సీట్లు పెంచినప్పటికీ.. వాటిలో అందరికీ హాస్టల్ సదుపాయాలు కల్పించడానికి బదులుగా డే స్కాలర్ పద్ధతిలో ఈ సీట్లు భర్తీ చేయడంవల్ల ఎవరికీ ఇబ్బందులు రావని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఐఐటీలో ఇంజినీరింగ్ విద్య చదువాలన్న లక్ష్యం నెరవేరడమే కాకుండా.. సాంకేతిక విద్యలో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీట్ల సంఖ్య లక్షకు పెంచి, నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేస్తే.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐటీలకు పెద్ద తేడా ఏమీ ఉండదన్న మరో అభిప్రాయాన్ని కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.