Begin typing your search above and press return to search.

హిందీ వస్తేనే లోన్ ఇస్తారట !

By:  Tupaki Desk   |   23 Sept 2020 4:20 PM IST
హిందీ వస్తేనే లోన్ ఇస్తారట !
X
దేశ భాష అయిన హిందీ వస్తేనే బ్యాంక్‌ లోన్ ఇస్తానని చెప్పిన బ్యాంక్‌ మేనేజర్ ‌పై అధికారులు బదిలీ వేటు వేశారు. అసలు హిందీకి , బ్యాంకు లోన్ కి సంబంధం ఏమిటి ? లోన్ ఇవ్వాలంటే తగిన పత్రాలు , అలాగే పూచికత్తు ఆస్తులు చెక్ చేసుకోవాలని కానీ , హిందీ రాదా , ఇంగ్లీష్ రాదా అన్న ప్రశ్నలు అవసరం లేదు కానీ , ఓ బ్యాంక్ మేనేజర్ అత్యుత్సహం ప్రదర్శించి ,,హిందీ తెలియకపోతే లోన్ ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. అది కూడా తమిళ భాష ను అమితంగా ప్రేమించే తమిళనాడులో ఈ ఘటన జరగడం గమనార్హం. అసలు ఏమైందో పూర్తి వివరాల్లోకి వెళ్తే ...

తమిళనాడులోని అరియలూరు జిల్లా యుద్ధపల్లం గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ డాక్టర్‌ స్రుబమణియన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు చోళపురంలోని ఓ జాతీయ బ్యాంక్‌ లో లోన్ కోసం అప్లై చేసుకున్నారు. ఆ లోన్ గురించి బ్యాంక్‌ మేనేజర్‌ విశాల్‌ నారయణన్‌ కాంబ్లేను సంప్రతించినప్పుడు మీకు హిందీ వచ్చా.. అని ప్రశ్నించారు. తనకు తమిళం, ఆంగ్లం మాత్రమే తెలుసని హిందీరాదని సుబ్రమణియన్‌ తెలిపారు. దీనితో హిందీ తెలిస్తేనే రుణమిస్తానని, లేకుంటే ఇవ్వనని మేనేజర్‌ తేల్చి తెలిపారు.

దీనితో సుబ్రమణియన్‌ ఈ విషయాన్ని మీడియాకి తెలియజేసాడు. న్యాయవాది ద్వారా పంపిన నోటీసులకు మేనేజర్‌ బదులివ్వలేదని తెలిపారు. అయితే , దీనికి సంబంధించిన వార్త ప్రసార మాధ్యమాల్లో రావడంతో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. హిందీ భాష తెలిస్తేనే రు ణమిస్తానని చెప్పిన బ్యాంక్‌ మేనేజర్‌ పై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనితో నిర్వాహకులు మేనేజర్‌ ను రీజనల్‌ ఆఫీసుకు బదిలీ చేశారు.