Begin typing your search above and press return to search.

వెల్లుల్లిని ఇలా తీసుకుంటే క్యాన్సర్​ దూరం..!

By:  Tupaki Desk   |   21 Feb 2021 6:00 AM IST
వెల్లుల్లిని ఇలా తీసుకుంటే క్యాన్సర్​ దూరం..!
X
వెల్లుల్లి వంటగదిలో ఓ మూలకు పడిఉంటుంది. సాధారణంగా రుచిని పెంచేందుకు దీన్ని వంటల్లో వేస్తుంటాం. అయితే వెల్లుల్లితో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. నిజానికి 'ఇండియన్​ కిచెన్'​ ఓ ఆయర్వేద వైద్యశాల మన కిచెన్​లో ఉంటే లవంగాలు, యాలకులు, జీలకర్ర, అల్లం, మెంతులు ఇలా చాలా వంట దినుసులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటి గొప్ప తెలుసుకొని వాడుకొంటే మనం ఆస్పత్రికి వెళ్లే బాధ దాదాపు తప్పదు.

అయితే మన వంటింట్లో ఉండే వెల్లుల్లితో ఏయే ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..జలుబు, జ్వరం, ఫ్లూ, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా వెల్లుల్లి అరికడుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. జీర్ణసంబంధిత సమస్యలు ఉంటే ప్రతిరోజు ఉదయం ఓ గ్లాసు నీటితోపాటు వెల్లుల్లిని తీసుకుంటే మలబద్దకం, గ్యాస్​ట్రబుల్​ వంటి సమస్యలు దూరమవుతాయట. అంతేకాక బరువుకూడా తగ్గుతారట. రక్తం మందంగా ఉన్నవారికి వెల్లుల్లి తినడం వల్ల చాలా ఉపయోగాలు కలుగుతాయి.గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు కూడా ప్రతిరోజు ఉదయం ఖాళీకడుపులో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

పరగడుపుతో.. నీరు, పచ్చి వెల్లుల్లి సేవించడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. డిప్రెషన్​, షుగర్​ ఉన్నవాళ్లు కూడా వెల్లుల్లిని తీసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.ప్రతిరోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకొంటే బీపీ, షుగర్​ అదుపులో ఉంటాయట.క్యాన్సర్ కారకాలను చంపేసే గుణం కూడా వెల్లుల్లిలో ఉంది. ప్రతిరోజు పరగడపున వెల్లుల్లిని తీసుకుంటే క్యాన్సర్​ కారకాలను చంపేస్తుందని డాక్టర్లు అంటున్నారు.