Begin typing your search above and press return to search.

పెట్స్​తో కలిసి పడుకుంటే ఆ కిక్కేవేరు..! సైంటిస్టులు కూడా అదే చెబుతున్నారు..!

By:  Tupaki Desk   |   12 Dec 2020 10:17 PM IST
పెట్స్​తో కలిసి పడుకుంటే ఆ కిక్కేవేరు..!  సైంటిస్టులు కూడా అదే చెబుతున్నారు..!
X
చాలామందికి పెట్స్​ను పెంచుకోవడం అలవాటు. వాటిని తమ కుటంబసభ్యులుగానే భావిస్తారు. తమతో పాటే విహారయాత్రలకు తీసుకెళ్తారు. వాటితో కలిసే భోజనం చేస్తారు. వాటిని పక్కన ఉంచుకొని పడుకుంటారు. అయితే పెట్స్​తో కలిసి పడుకోవడం ఎంతో మంచిదని.. దానివల్ల సుఖనిద్ర పడుతుందని ఇప్పుడు సైంటిస్టులు కూడా తేల్చిచెప్పారు. పార్ట్నర్స్​ కంటే పెట్స్​ పక్కనపడుకుంటేనే మంచి నిద్ర వస్తుందట. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని ఓ పరిశోధనలో రుజువైంది. న్యూయార్క్​లోని కాన్సియస్​ కళాశాల క్రిస్టీ ఎల్​. హాఫ్​మాన్​ ఈ పరిశోధన నిర్వహించారు. ఆయన మొత్తం 962 మంది మహిళలపై పరిశోధన సాగించారు.

వారంతా తమ భర్తలతోకంటే పెంపుడు కుక్కలు పక్కన ఉన్నప్పుడే సుఖంగా నిద్రపోయారట. వీరిలో 55 శాతం మంది పెంపుడు కుక్కలతో.. 31 శాతం మంది పిల్లితో నిద్రించారు. మరో 57 శాతం మంది భర్త లేదా బాయ్​ఫ్రెండ్​తో నిద్రించారు. అయితే వీరు పార్ట్​నర్​ కంటే పెట్స్​తో నిద్రించినప్పుడే రిలాక్స్​గా ఫీలయ్యారట. పిల్లులతో పడుకున్నవారు, భర్తలు లేదా.. బాయ్​ఫ్రెండ్​తో నిద్రించిన వారికంటే పెట్​తో నిద్రించిన వారే సుఖంగా ఉన్నారట. పిల్లులు మధ్యలోనే నిద్రలేచి యజమానులను ఇబ్బంది పెడతాయి. కానీ పెట్స్​ మాత్రం అస్సలు నిద్రాభంగం కలిగించలేదట. అవి షెడ్యూల్​ ప్రకారం నిద్రిస్తాయి. అందువల్ల తమ యజమానులను కూడా హాయిగా నిద్రపోనిస్తాయి. సో మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే మీరు కూడాట్రై చేయండి మరి.