Begin typing your search above and press return to search.
ఆస్తుల పంపిణీలో భాగంగా ప్రభుత్వానికి కట్టిన పన్ను ఎంతో తెలిస్తే.. అవాక్కే
By: Tupaki Desk | 29 April 2021 5:00 AM ISTకోట్లాది మందిలో ఒకరిద్దరు మాత్రమే తమ జీవిత కాలంలో సంపాదించే మొత్తాన్ని.. పన్ను రూపంలో కట్టేసిన పారిశ్రామిక కుటుంబ వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రపంచంలో అత్యధిక వారసత్వ పన్ను చెల్లించిన రికార్డును వారి పేరుతో నమోదు చేసుకున్నారు. ఆస్తుల పంపకంలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చిన వారసత్వ పన్ను చెల్లించిన మొత్తం గురించి తెలిసినంతనే అవాక్కు అయ్యేలా ఉంది. అక్షరాల రూ.80వేల కోట్ల మొత్తాన్ని పన్ను రూపంలో కట్టిన ఆ పారిశ్రామిక దిగ్గజ ఫ్యామిలీ ఏమిటి? అంత భారీ మొత్తాన్ని ఎందుకు కట్టారు? అన్న విషయంలోకి వెళితే..
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ సంస్థ మాజీ ఛైర్మన్ లీ కున్ మీ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా దక్షిణ కొరియాలో వారసత్వ పన్ను రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ వారసులకు ఆస్తిని బదిలీ చేసే సమయంలో యాభై శాతం మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. శాంసంగ్ మాజీ ఛైరర్మన్ లీ కున్ హీ వదిలేసిన ఆస్తిని వారసులకు పంచే వేళలో.. తాను సంపాదించిన ఆస్తిలో సగాన్ని వారసత్వ పన్నురూపంలో చెల్లించారు. ఇందుకోసం రూ.80వేల కోట్లనుచెల్లించారు.
ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. గత ఏడాది దేశ వ్యాప్తంగా వసూలు చేసిన ఆస్తి పన్ను కంటే కూడా.. లీ కున్ హీ కుటుంబం వారసత్వ ఆస్తిపన్ను కింద చెల్లించిన మొత్తం నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. లీ కున్ హీ గత ఏడాది అక్టోబరులో అనారోగ్యంతో మరణించారు.
ఆయన హయాంలోనే శాంసంగ్ సంస్థ దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచింది. లీ కున్ హీ వదిలి వెళ్లిన ఆస్తిని వారసులు పంచుకున్న వివరాల్ని వెల్లడించలేదు. ప్రభుత్వానికి మాత్రం రూ.80వేల కోట్లను చెల్లించారు. అదే సమయంలో లీ సేకరించిన 23 వేల అత్యంత విలువైన పెయింటింగ్ లు.. పురాతన వస్తువుల్ని జాతీయ మ్యూజియానికి ఇచ్చేస్తున్నట్లు తెలిపారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు ట్విస్టు ఏమంటే.. ఇంత భారీగా పన్ను మొత్తాన్ని.. వందల కోట్లు విలువైన పెయింటింగ్ లును ప్రభుత్వానికి ఇచ్చినప్పటికి.. లీ వారసుల్లో ఒకరైన జే వైలీ అవినీతి ఆరోపణలతో రెండున్నరేళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు.. దేని కోసం ఆస్తుల ఆరాటం.. కష్టపడి సంపాదించిన మొత్తం రూల్ ప్రకారం ప్రభుత్వ బొక్కసానికి వెళ్లటం మినహా చేసేదేముంది అన్న భావన కలగటం ఖాయం.