Begin typing your search above and press return to search.

ఈ లక్షణాలు ఉంటే మీలో విటమిన్​ ‘డీ’ లోపం ఉన్నట్టే..!

By:  Tupaki Desk   |   31 May 2021 2:52 AM GMT
ఈ లక్షణాలు ఉంటే మీలో విటమిన్​ ‘డీ’ లోపం ఉన్నట్టే..!
X
విటమిన్​ డీ మనకు ఎంతో ఈజీగా దొరుకుతుంది. ఉదయం కాసేపు అలా సూర్యరశ్మికి ఉన్నామంటే ఇది మన శరీరానికి అందుతుంది. కానీ చాలా మందికి పొద్దున్నే ఎండలో ఉండాలంటే బద్దకం.. కొంతమంది ఆఫీసు ఒత్తిడి, నైట్ డ్యూటీ తదితర కారణాలతో విటమిన్​ డీ కి దూరమవుతూ ఉంటారు. ప్రస్తుతం మన దేశంలో విటమిన్​ డీ లోపం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ విటమిన్​ లోపంతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఫలితంగా దీర్ఘకాలికంగా అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు.

విటమిన్​ డీ లోపం ఉంటే ఇమ్యూనిటీ కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తద్వారా కరోనా సోకే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది విటమిన్​ డీ సప్లిమెంట్స్​ తెచ్చుకొని వాడుతున్నారు. విటమిన్​ డీ లోపం ఉంటే మన శరీరంలో ఎటువంటి మార్పులు చేసుకుంటాయి. ఈ విటమిన్​ వల్లే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, నాడీ సంబంధిత సమస్యలు తొలగించడానికి, శరీరంలోకి సూక్ష్మజీవులు రాకుండా ఉండేందుకు విటమిన్​ డీ ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సూర్యకిరణాల ద్వారా విటమిన్​ అందుతున్న విషయం తెలిసిందే. వీటితో పాటు కొన్ని రకాల ఆహారపదార్థాల్లోనూ ఈ విటమిన్​ పుష్కలంగా లభిస్తుంది.

ప్రస్తుతం మనదేశంలో చాలా మంది విటమిన్​ డీ లోపంతో బాధపడుతున్నారు.

ఈ సమస్య వల్ల పిల్లలలో మృదువైన ఎముకలు (రికెట్స్), పెద్దవారిలో ఎముకలు పెళుసైన ఎముకలు (ఆస్టియోమలాసియా) ఏర్పడతాయి. రొమ్ము క్యాన్సర్ , పెద్దప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా రావొచ్చు.మీకు అలసటగా ఉన్నా.. ఏదైనా శరీరభాగంలోకానీ. ఎముక లేదా కండరాల నొప్పి కలిగినా , మెట్లు ఎక్కడానికి లేదా దిగడానికి ఇబ్బంది కలిగినా విటమిన్​ డీ లోపం అని చెప్పవచ్చు.చేప, గుడ్డు పచ్చసొన, రొయ్యలు, పాలు, తృణధాన్యాలు, పెరుగు, ఆరెంజ్ జ్యూస్​ తదితర ఆహారపదార్థాల ద్వారా విటమిట్​ డీ ని పొందవచ్చు.