Begin typing your search above and press return to search.
ట్రంప్ కు ఓటు వేయకపోతే అంతే.. బెదిరింపు ఈమెయిల్స్
By: Tupaki Desk | 24 Oct 2020 3:40 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి కాకరేపుతోంది. అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ ల మధ్య ఫైట్ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. అమెరికన్లే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే..ఈ క్రమంలోనే ట్రంప్ సైతం మాటల వాడి పెంచారు.
అయితే ట్రంప్ కు సర్వేలు షాక్ లు ఇస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి సర్వేలే వచ్చాయి. విజయం మాదేనన్న ధీమాతో ట్రంప్ శిభిరం ఉంది. కరోనా వైరస్ దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
తాజాగా అమెరికా నిఘా వర్గాలు సంచలన విషయాన్ని బయటపెట్టాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి రష్యా, ఇరాన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.
వచ్చేనెల 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులకు అనుమానాస్పద ఈమెయిల్ సందేశాలు వస్తున్నట్టుగా గుర్తించారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు ఓటేయకుంటే మీ అంతుచూస్తాం.. ఎన్నికలు పూర్తైన వెంటనే మీ పని పడుతాం అని హెచ్చరిస్తూ ‘ఫ్రౌడ్ బాయ్స్’ అనే సంస్థ పేరిట ఈ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టుగా గుర్తించారు.
ఇక ఈ మెయిల్స్ వెనుక ఇరాన్ హస్తం ఉందని.. ఇదంతా ట్రంప్ ప్రతిష్టను దిగజార్చే కుట్ర ఉందని అంటున్నారు. ఈ మేరకు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం ఒక ప్రకటనను విడుదల చేసింది.
కాగా ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికా ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని.. తమకు ఆ అవసరం లేదని స్పష్టం చేసింది.
అయితే ఇవి ట్రంప్ ను గెలిపించాలని ఆయన మద్దతుదారులు చేస్తున్నారా? లేక విదేశాల్లో ట్రంప్ ను రాకుండా చేయాలని ఇలా కుట్ర పన్నుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.