Begin typing your search above and press return to search.

ఒబెసిటీ ఉంటే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా పనిచేయదట !

By:  Tupaki Desk   |   1 March 2021 8:40 AM GMT
ఒబెసిటీ ఉంటే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా పనిచేయదట !
X
ప్రపంచంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత ఏడాదికి పైగా ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతోంది. మధ్యలో కొంచెం అదుపులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఇకపోతే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫైజర్ వ్యాక్సిన్ గురించి ఓ కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది ఒబెసిటీతో బాధపడేవాళ్లలో ఫైజర్ వ్యాక్సిన్ అంత ఎఫెక్టివ్ గా పనిచేయకపోవచ్చు అని ఇటాలియన్ రీసెర్చర్స్ నిర్వహించిన స్టడీలో ఈ విషయం వెల్లడైందట.

వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత ఒబెసిటీ ఉన్న హెల్త్ కేర్ వర్కర్లలో యాంటీబాడీలు పెరగలేదని గుర్తించారట. ఆరోగ్యంగా ఉండేవారితో పోలిస్తే.. ఒబెసిటీతో ఉండేవారిలో సగం మాత్రమే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తెలిసింది. ఈ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ కరోనా నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఒబెసిటీ ఎక్కువగా ఉండటం అంటే బాడీ మాస్ ఇండెక్స్ 30కు మించి ఉండటం. అలా ఉండేవారిలో కరోనా రిస్క్ ఎక్కువగా ఉండి సగం మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారట. హాస్పిటల్ కు వెళ్లి ఈ రిస్క్ తగ్గించుకున్న వాళ్లూ ఉన్నారు. అలాగే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ లు ఉన్న వారికి కరోనా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

వీటితో పాటు శరీరంలో అధికంగా కొవ్వు చేరినా సమస్యలు తప్పవు. మెటబాలిక్ మార్పులు వచ్చి, ఇన్సులిన్ ను తగ్గిస్తుంది లేదా పెంచుతుంది. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని శరీరం కోల్పోతుంది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 248హెల్త్ కేర్ వర్కర్లలో యాంటీబాడీ రెస్పాన్స్ 99.5 శాతం మందిలో పాజిటివ్ ‌గా ఉంది. కరోనా నుంచి రికవరీ అయిన వారికంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రెస్పాన్స్ ఎక్కువగా ఉందట. ఇకపోతే , భారతదేశంలో రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ మొదలైంది. రెండో దశలో 60 ఏళ్లు పైబడినవారు, ఇతర రోగాలు ఉన్న 45 నుంచి 59 ఏళ్ల వయస్సువారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడానికి వెబ్‌ సైట్ ‌లో రిజిస్టర్ చేసుకోవాలి.