Begin typing your search above and press return to search.
రాహుల్ భారీ పథకం.. ఓట్లు కురిపిస్తుందా?
By: Tupaki Desk | 10 March 2019 11:02 AM ISTరాహుల్ గాంధీ దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మరో భారీ వరాన్ని కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పిస్తామని.. వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శంషాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడారు. పేదవాడు ఎక్కడున్న తమ ప్రభుత్వం వెతికి మరీ డబ్బులు వేస్తుందని స్పష్టం చేశారు. కనీసం ఆదాయం కంటే తక్కువగా ఏ ఒక్క వ్యక్తి ఉండేందుకు వీలు లేదని ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని చెప్పుకొచ్చారు.
అదే ప్రధాని నరేంద్రమోడీ.. నీరవ్ మోడీ - మాల్యాలాంటి బడాబాబుల జేబుల్లో డబ్బులు నింపి విదేశాలకు పంపించారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తుండడంతో దీనికి ధీటుగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలపై రాహుల్ గురిపెట్టి ఈ పథకాన్ని ప్రకటించారు.
కనీస ఆదాయ పథకంపై పూర్తి విధివిధానాలు ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రమే ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధ పథకాల కింద అందుతున్న సబ్సిడీల మొత్తానికి మరికొంత అదనంగా కలిపి ప్రతీ కుటుంబానికి ప్రతీ నెల ఆదాయం కింద వచ్చేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే పేదలకు ఎంత మొత్తం ఇస్తారన్నది క్లారిటీ ఇవ్వలేదు.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం.. పేదలకు డైరెక్టుగా నగదు బదిలీ చేసి కోట్లాది కుటుంబాలకు దగ్గర కావచ్చొన్నది రాహుల్ వ్యూహంగా తెలుస్తోంది. ప్రధాని మోడీ ధనవంతులను టార్గెట్ చేశాడని.. తాము పేదల కోసం పథకాలు ప్రవేశపెట్టామని దీని ద్వారా రాహుల్ జనంలోకి వెళుతున్నారు. ఈ పథకం దిగువ మధ్యతరగతి జనాలను, పేదలను ప్రధానంగా ఆకర్షిస్తోంది.