Begin typing your search above and press return to search.
తండ్రి తప్పు చేస్తే కొడుకు ఆస్తుల్నిస్వాధీనమా? తప్పు పట్టిన టీ హైకోర్టు
By: Tupaki Desk | 21 March 2021 5:52 AM GMTఒక కీలక కేసులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఒక తండ్రి బుక్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంతో సంబంధం లేని ఆయన కుమారుడి ఆస్తుల్ని జప్తు చేయటంపై అభ్యంతరం వ్యక్తమైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న వి.వరప్రసాద్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
ఈ తనిఖీల్లో ఆయన కుటుంబానికిచెందిన రూ.1.28 కోట్లకుపైబడిన ఆస్తుల్ని సీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. వరప్రసాద్ కుమారుడు ఆదిత్య సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తుున్నారు. కొండపూర్లో అతనికి రూ.53లక్షలతో ఒక ప్లాట్ కొన్నాడు. దాన్ని కూడా ఏసీబీ అధికారులు జప్తుచేశారు. దీనిపై ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. ఫలితం తేల్లేదు. ఈ నేపథ్యంలో ఆదిత్య హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా తన డబ్బులతో.. తను సొంతంగా ఏర్పాటు చేసుకున్నానని.. అలాంటప్పుడు తన ఆస్తిని ఎలా స్వాధీనంలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిన హైకోర్టు.. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబడితే మాత్రం.. తండ్రిఆస్తులతో పాటు కొడుకు స్వార్జిత ఆస్తిని ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించింది.