Begin typing your search above and press return to search.

అలాగైతే ముంచేస్తుందిః రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   7 April 2021 10:00 PM IST
అలాగైతే ముంచేస్తుందిః రాహుల్ గాంధీ
X
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. ఒక్క రోజులోనే ల‌క్ష‌కుపైగా కేసులు న‌మోదు కావ‌డంతో ప‌రిస్థితి తీవ్ర‌త అర్థ‌మైన జ‌నం.. భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు ఏకంగా లాక్ డౌన్ నిర్ణ‌యం కూడా తీసుకుంది. వీకెండ్ ల్లో లాక్ డౌన్ విధించనున్న‌ట్టు సీఎం ఉద్ధ‌వ్ ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు ప‌లు రాష్ట్రాలు కూడా క‌ఠిన నిర్ణ‌యాల గురించి ఆలోచిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాల‌నే డిమాండ్ మొద‌లైంది. మ‌హ‌మ్మారి ముంచుకొస్తున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ అంద‌రికీ ఇవ్వ‌క‌పోతే.. వేగంగా విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.అయితే.. కేంద్రం మాత్రం అది సాధ్యం కాద‌ని చెబుతోంది. అవ‌స‌రం ఉన్న‌వారికే వ్యాక్సిన్ ఇస్తామ‌ని చెబుతోంది. దీంతో.. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా.. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అవ‌స‌రాలు ఉన్న‌వారికే ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాంటి వారిని గుర్తించ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుందని, ఈ లోగా వైర‌స్ ముప్పేట దాడిచేస్తుంద‌ని అన్నారు. అందువ‌ల్ల ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.