Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో వర్షం పడుతున్న వేళ.. గొడుగు పడితే ఫైన్
By: Tupaki Desk | 19 Oct 2021 12:11 PM ISTవినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. వర్షం పడుతున్న వేళ.. రెయిన్ కోట్ వేసుకున్నా.. చేతిలో గొడుగు పట్టుకొని వెళతారు. కానీ.. అలా వెళ్లటం కేరళలో మాత్రం నేరంగా పరిగణిస్తున్నారు. అదెలా? అంటే.. వారు చెప్పే కారణం కూడా లాజిక్ గానే కనిపిస్తుంది. ఇంతకీ.. వాన వేళ చేతిలో గొడుగు లేకుండా ఇంకేం ఉండాలంటూ కోపగించుకోకుండా కేరళ ప్రభుత్వ వాదన వింటే.. నిజమే కదా? అనిపించటం ఖాయం. అదెలానంటే..
వర్షం వేళ గొడుగు తీసుకొని వెళ్లాల్సిందే. అదే తప్పు కాదు. కానీ.. వాహనం మీద వెళ్లేటప్పుడు వెనుక ఉన్న వారు గొడుగు పట్టుకొని వెళ్లటం చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వెనుక నుంచి వచ్చే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా.. ట్రాఫిక్ ఉన్న సమయంలో టూవీలర్ మీద వెళ్లేవారు గొడుగుల్ని పట్టుకొని వెళ్లటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.
ఈ కారణంతో వర్షం వేళ టూవీలర్ మీద వెళ్లే వారు గొడుగులు పట్టుకొని వెళితే జరిమానా విధించాలని నిర్ణయించారు. ఒకరి సౌకర్యం కోసం మిగిలిన వారు అసౌకర్యానికి గురయ్యే ఇలాంటి విధానాల వల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకోవటంతో.. అలాంటి వాటికి చెక్ చెప్పే పనిలో భాగంగా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో.. కేరళ వెళ్లినప్పుడు మాత్రం ఇలాంటి రూల్ ఉందన్న విషయాన్ని మాత్రం మిస్ కావొద్దు.