Begin typing your search above and press return to search.
కేంద్రానికి సాధ్యం కాకుంటే.. టీకా ఫ్రీగా ఇస్తానంటున్న ఆ రాష్ట్ర సీఎం
By: Tupaki Desk | 15 Jan 2021 4:00 PM ISTఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. మరో రోజులో దీన్ని వైద్య సిబ్బందికి.. వైద్యులకు.. వైద్యఆరోగ్య కార్యకర్తలకు తొలిదశలో అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కరోనా వారియర్స్ కు తాము వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వనున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
కరోనాకు చెక్ చెప్పే వ్యాక్సిన్ ను ఉచితంగా ఇచ్చే విషయంలో కేంద్రప్రభుత్వం ఫెయిల్ అయితే.. తాము ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ను దేశ వ్యాప్తంగా అందరికి ఉచితంగా ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఇప్పటికి వ్యాక్సిన్ ను భరించే స్థితిలో లేని ఎందరో ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం ఏం చేస్తుందో చూస్తామన్న ఆయన.. వ్యాక్సిన్ ను అందరికి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా విధుల్లో ఉండి దాని బారిన పడి మరణించిన వైద్యుడు హితేశ్ గుప్తా కుటుంబాన్ని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యుడి కుటుంబ సభ్యుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పటంతో పాటు.. కోటి రూపాయిల చెక్కును అందించారు. డాక్టర్ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించారు. మరి.. ఢిల్లీ ముఖ్యమంత్రి బాటలో మరెందరు సీఎంలు.. ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు? మరి.. వారిప్పటి వరకూ ఎందుకు స్పందించనట్లు?