Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి నోరు తెరిస్తే దేశమే షేక్ అవుతుందట

By:  Tupaki Desk   |   1 July 2016 6:40 AM GMT
మాజీ మంత్రి నోరు తెరిస్తే దేశమే షేక్ అవుతుందట
X
కొంతమంది నేతల మాటల్ని చూస్తే బాడాయికి బ్రాండ్ అంబాసిడర్లు మాదిరి కనిపిస్తారు. ఆ తరహా నేతగా చెప్పాలి మహారాష్ట్ర మంత్రి ఏకనాథ్ ఖడ్సే. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ఖడ్సేకు ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా ఈ మధ్యన ఆరోపణలు రావటం.. ఆయన మీద తీవ్రవిమర్శలు వెల్లువెత్తటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. తన గురించి గొప్పలు చెప్పుకోవటం.. తానెంత కీలకమన్నట్లుగా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు.

మహారాష్ట్ర మాజీ మంత్రి పదవిని ఊడబీకేసి ఇంటికి పంపిన నెల తర్వాత నోరు విప్పిన ఆయన.. తాను కానీ నోరు విప్పితే దేశం షేక్ అయిపోతుందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఉన్నారంటే తానే కారణంగా గొప్పలు చెప్పిన ఆయన.. దశాబ్దాల తరబడి ఫ్రెండ్స్ గా ఉన్న బీజేపీ.. శివసేనల మధ్య గొడవలకు తానే కారణమన్న విషయాన్ని చెప్పుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు పార్టీలు విడిపోవటం వల్లనే బీజేపీ చేతికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పుకున్న ఆయన.. దేవేంద్ర ఫడ్నవీస్ కు పదవి రావటం తన వల్లే అన్న మాట తప్ప మిగిలినవన్నీ చెప్పుకున్నారు. తాను కానీ లేకపోతే.. సీఎం పదవి శివసేనకు దక్కిండేదన్న వ్యాఖ్య చేశారు. ఇన్ని మాటలు చెప్పిన ఆయన.. దేశం షేక్ అయ్యే మాట కూడా చెప్పేస్తే బాగుండేది.