Begin typing your search above and press return to search.

మంత్రి అవినీతికి పాల్పడితే..అలా ఎందుకు చేయలేదు : బాంబే హైకోర్టు

By:  Tupaki Desk   |   1 April 2021 2:15 PM IST
మంత్రి అవినీతికి పాల్పడితే..అలా ఎందుకు చేయలేదు : బాంబే హైకోర్టు
X
ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్‌‌‌ పై బాంబే హైకోర్టు అక్షింతలు వేసింది. హోంమంత్రి అవినీతి పై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ బాంబే హైకోర్టులో మాజీ సీపీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు, పరంబీర్ సింగ్‌‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి పై ఆరోపణల విషయంలో ఎఫ్ ఐ ఆర్ ఎందుకు నమోదుచేయలేదని ప్రశ్నించింది. ‘మీరు పోలీసు కమిషనర్, మీ కోసం చట్టాన్ని ప్రత్యేకంగా ఎందుకు కేటాయించాలి, పోలీస్ అధికారులు, మంత్రులు, రాజకీయ నేతలు చట్టానికి అతీతులా? అంటే మీరు చట్టాలకు అతీతులమని భావిస్తున్నారా’ అంటూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీజే దత్ నిలదీశారు. హోంమంత్రి, సీఎం ప్రమేయం ఉన్నందున మేము చట్టాలను పక్కన పెట్టలేం. ఒక ప్రధాని అవినీతికి పాల్పడితే ఎవరు దర్యాప్తు చేస్తారు, మీకు బయటి నుంచి విశిష్ట అధికారాలు కావాలా ’ అని ప్రశ్నించింది.

ఈ మద్యే బాంబే పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి పరంబీర్ సింగ్‌ ను తప్పించి, హోంగార్డు విభాగానికి బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన హోంమంత్రి అనిల్ దేశ్‌ ముఖ్‌ పై ఆరోపణలు గుప్పిస్తూ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయడంతో దీనిపై కలకలం రేగింది. హైకోర్టులో విచారణ సందర్భంగా పరంబీర్ సింగ్ తరఫున వాదనలు వినిపిస్తూ..నగరంలోని పోలీసు బలగాలకు అత్యున్నత పదవిని అలంకరించిన, 30 సంవత్సరాలకుపైగా సేవలందించిన వ్యక్తి నుంచి వచ్చిన కఠినమైన వాస్తవాలు ఇవి అని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించింది.

విచారణలో ఎఫ్ ఐ ఆర్ దాఖలు ముఖ్యం, ఎఫ్ ఐ ఆర్‌ నమోదు చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారు. ప్రధాన నిందితుడిపై ఎఫ్ ఐ ఆర్ తన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకోవాలని పరంబీర్ సింగ్ కోరాగా మీరు పోలీస్ అధికారి.. ఒకవేళ నేరం జరిగినట్టు గుర్తిస్తే ఎఫ్ ఐ ఆర్ నమోదుచేయడం మీ బాధ్యత, అది మీరెందుకు చేయలేదు, నేరానికి పాల్పడినట్టు గుర్తించిన తర్వాత ఒకవేళ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకపోతే మీరు విఫలమైనట్టే..మీరు సీఎంకి లేఖరాసి చేతులు దులుపుకోలేరు. ఈ విషయంలో మిమ్మల్ని విచారించవచ్చు అని కోర్టు తెలిపింది. ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమిక అంశం..ఇది లేకుండా దర్యాప్తు ఉండదని స్పష్టం చేసింది. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని మీ సమక్షంలో హోంమంత్రి ఈ విషయం చెప్పారని ఈ ఫిర్యాదుకు ఆధారాలు మాకు చూపించగలరా?’ అని హైకోర్టు నిలదీసింది. ఈ అంశంపై విచారణ పూర్తిచేసిన బాంబే హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.