Begin typing your search above and press return to search.

ఐసీఎంఆర్ పరిశోధన: వృద్ధులపై బీసీజీ టీకా

By:  Tupaki Desk   |   19 July 2020 10:15 AM
ఐసీఎంఆర్ పరిశోధన: వృద్ధులపై బీసీజీ టీకా
X
కరోనా వైరస్ తో ఇటలీ దేశంలో మొత్తం 60ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా తుడుచుపెట్టుకుపోయింది. యువకులకు మాత్రమే చికిత్సనందించి వృద్ధులను వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. కరోనా 60ఏళ్లు దాటిన రోగులకు చాలా డేంజర్ అని అధ్యయనంలో తేలింది.

ప్రస్తుతం మన దేశంలోనూ అదే పరిస్థితి. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో కరోనాతో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న రోగులను కరోనా ఏం చేయడం లేదని పరిశోధనలో తేలింది.

తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా దీనిపై అధ్యయనం చేసింది. ఈ క్షయ వ్యాధి టీకా వృద్ధుల చికిత్సలోనూ.. మరణాల సంఖ్యను తగ్గించడంలోనూ తోడ్పడుతుందా అనే దానిపై పరిశోధన చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లోని రోగులపై ఐసీఎంఆర్ బృందాలు అధ్యయనం నిర్వహిస్తున్నాయి. బీసీజీ టీకా కరోనాను సమర్థంగా నివారించగలదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇదే ఫలిస్తే వృద్ధులకు బీసీజీ టీకా వరంగా మారడం ఖాయం.