Begin typing your search above and press return to search.

చైనాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ... యూఎన్‌ హెచ్ ఆర్ సి ని కోరిన ఐసీజే !

By:  Tupaki Desk   |   4 April 2020 5:00 PM GMT
చైనాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ... యూఎన్‌ హెచ్ ఆర్ సి ని కోరిన ఐసీజే !
X
ఎవరు అవునన్నా , కాదన్నా కూడా కరోనా వైరస్ కి సృష్టి కర్త చైనానే. కరోనా వైరస్ ను చైనా సృస్టించక పోయినప్పటికీ కూడా కరోనా వైరస్ బయటపడింది మాత్రం చైనాలోనే. చైనా నుండి ఇతర దేశాలకి ఈ వ్యాధి విస్తరించకుండా తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ..ఈ రోజు ఈ మహమ్మారి వల్ల యావత్ ప్రపంచం అనేక ఇబ్బందులని ఎదుర్కొంటుంది. ఈ కరోనా దెబ్బకి మొత్తం ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో .. వైరస్ జన్మస్థలమైన చైనాపై చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలిని అంతర్జాతీయ న్యాయకోవిదుల మండలి డిమాండ్ చేసింది.

ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణించారని , ప్రపంచ దేశాలకు చైనా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. యూఎన్‌ హెచ్ ఆర్ సీ కి లండన్‌ లోని ఐసీజే అధ్యక్షుడు, ఆలిండియా బార్ అసోసియేషన్ చైర్మన్ అదిష్ సీ. అగర్వాలా ఫిర్యాదు చేశారు. కరోనాను వ్యాపింపజేయడం ద్వారా మానవాళికి పెను విపత్తు కలిగింది అని, అందువల్ల ప్రపంచ దేశాలకు అసాధారణ నష్టపరిహారం చెల్లించాలని చైనాను ఆదేశించాలని కోరారు. మరీ ముఖ్యంగా భారత దేశానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని చైనాను ఆదేశించాలని డిమాండ్ చేశారు.

చైనా ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది అని , లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. జీవ సంబంధ యుద్ధం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలను అణగదొక్కి, తాను ప్రపంచంలో పెద్దన్న స్థాయికి చేరుకోవాలనేది చైనా లక్ష్యమని, కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థను, ఇతర దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా ప్రభుత్వం, నాయకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని, అసమర్థత ప్రదర్శించారని ఐసీజే తెలిపింది.