Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటికి కొత్త షాక్

By:  Tupaki Desk   |   19 April 2016 10:12 AM GMT
ల‌గ‌డ‌పాటికి కొత్త షాక్
X
క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆయ‌న స్థాపించిన ‘ల్యాంకో ఇన్ ఫ్రా’కు త్వరలో బ్యాంకు గుప్పిట్లోకి వెళ్లనుంది. సదరు కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు ఇప్పటికే ఈ దిశగా చర్యలు ముమ్మరం చేశాయి. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సారధ్యంలో బ్యాంకుల కన్సార్టియం ల్యాంకో ఇన్ ఫ్రాకు పెద్ద మొత్తంలో రుణాలచ్చింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న ల్యాంకో ఆ తర్వాత రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో బకాయిల మొత్తం రూ.39,980 కోట్లకు చేరింది.

దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ ల్యాంకో నుంచి రుణాలను రాబట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ల్యాంకో గ్రూపులోని విద్యుత్ వ్యాపారాన్ని విడగొట్టేందుకు కార్యచరణను రూపొందించింది. ఇందులోని లగడపాటి కుటుంబానికి ఉన్న మెజారిటీ వాటాలను చేజిక్కించుకుని, సదరు కంపెనీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి తాను రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఆ బ్యాంకు ల్యాంకో ప్రతినిధులకు వివరించింది. ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న ల‌గ‌డ‌పాటికి ఈ ప‌రిణామం ఇబ్బందిక‌రంగా మార‌డం ఖాయ‌మ‌ని అంచనా వేస్తున్నారు.