Begin typing your search above and press return to search.

మాజీ క్రికెటర్ పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం

By:  Tupaki Desk   |   19 April 2021 10:00 PM IST
మాజీ క్రికెటర్ పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం
X
ఎప్పుడో రిటైర్ అయిపోయిన మాజీ క్రికెటర్ పై ఐసీసీ ఏకంగా 8 ఏళ్లు నిషేధం విధించడం చర్చనీయాంశమైంది. ఆయన ఏం చేశాడు? ఎందుకు నిషేధం విధించాడని క్రికెట్ ప్రేమికులు ఆరాతీస్తున్నారు.

శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హారా లోకుహెట్టేగేపై ఎనిమిదేళ్ల క్రితం నిషేధం పడింది. అతడిపై అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దిల్హారాపై సుధీర్ఘ నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

2013లో శ్రీలకం తరుఫున చివరిసారి ఆడిన అతడు దాదాపు ఎనిమిదేళ్లుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. కానీ శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్హారాపై అవినీతి, ఫిక్సింగ్ లకు పాల్పడినట్టు ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక విభాగం తేల్చింది.

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టీ10 లీగ్ లో నిబంధనలు ఉల్లంఘించి ఫిక్సింగ్ కు సహకరించడంతో లోకుహెట్టేగేపై నిషేధం విధిస్తూ ఐసీపీ కఠిన నిర్ణయం తీసుకుంది.

దిల్హారా శ్రీలంక తరుఫున 2005 నుంచి 2013 వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. జాతీయ జట్టుకు 9 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా శ్రీలంక జట్టుకు ఆడాడు. పెద్దగా రికార్డులు నమోదు చేయలేదు.