Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకు బాల్ ట్యాంపరింగ్ కు ఐసీసీ అనుమతి
By: Tupaki Desk | 26 April 2020 5:00 AM ISTబాల్ ట్యాంపరింగ్.. టెస్టులు, వన్డేల్లో బంతి మెరుపు, గ్రిప్ కోసం దాని రూపాన్ని దెబ్బతీస్తుంటారు క్రికెటర్లు. దీంతో బంతి టర్న్ అయ్యి వికెట్లు పడగొట్టేందుకు ఇలా చేస్తుంటారు. అలా చేసి ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్ ఏడాదిపాటు నిషేధానికి గురయ్యారు.
అయితే బంతి మెరుపు కోసం చాలా మంది తమ ఉమ్మిని బాల్ కు రుద్దడం చేస్తుంటారు. దీనికి ఐసీసీ కూడా ఆమోదం ఉంది. అయితే కరోనా దెబ్బతో ఇప్పుడు ఉమ్మి బాల్ మెరుపు పోగొట్టడం నిబంధనను ఐసీసీ సవరించబోతోందట.. ఉమ్ము, లాలాజలం ద్వారా కరోనా క్రికెటర్లకు వ్యాపించే ప్రమాదం ఉండడంతో.. ఇకపై బాల్ ట్యాంపరింగ్ ను ఉమ్మితో కాకుండా కృత్రిమ పదర్థాలు, ఇతర వస్తువులతో అనుమతించాలని ఐసీసీ భావిస్తోంది.
ఇక దీన్ని ఎంపైర్ల సమక్షంలోనే చేసేలా కొత్త రూల్ ను తీసుకు రావాలని ఐసీసీ భావిస్తోంది. ఇక నుంచి ఉమ్మితో కాకుండా ఏదైనా పదార్థంతోనే డైరెక్ట్ గా బాల్ ట్యాంపరింగ్ కు ఐసీసీ ఆమోదం తెలుపడం విశేషంగా మారింది. మొన్నటివరకు తప్పుగా ఏడాది వేటు వేసిన ఐసీసీ కరోనా దెబ్బకు ఏకంగా ట్యాంపరింగ్ ను ఆమోదించడం సంచలనంగా మారింది.