Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో పోస్ట్.. ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ ఊస్ట్

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:30 AM GMT
సోషల్ మీడియాలో పోస్ట్.. ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ ఊస్ట్
X
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కు గట్టి షాకిచ్చింది ఈసీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిని ఎన్నికల సంఘం శుక్రవారం తొలగించింది. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను షేర్ చేసిన తర్వాత ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

డిసెంబరులో జరగనున్న గుజరాత్ ఎన్నికల కోసం అహ్మదాబాద్ జిల్లాలోని బాపునగర్ - అసర్వా నియోజకవర్గాల సాధారణ పరిశీలకుడిగా యూపీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ నవంబర్ 7న నియమితులయ్యారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఎన్నికల అబ్జర్వర్ అంటూ ఆ కారుకు ఉన్న నేమ్ ప్లేట్ తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు. అభిషేక్ సింగ్ తన అధికారిక పదవిని "పబ్లిసిటీ స్టంట్"గా ఉపయోగించుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈసీ గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు శుక్రవారం లేఖ రాసింది.

ఈసీ సాధారణ పరిశీలకుని బాధ్యతల నుండి అభిషేక్ సింగ్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల సంబంధిత విధుల నుండి అతనిని డిబార్ చేసింది. అభిషేక్ సింగ్‌ను వెంటనే నియోజకవర్గం విడిచి వెళ్లాలని ఆదేశించిన ఈసీ ఆదేశించింది. కొత్త పరిశీలకుడిని నియమించే వరకు మరో అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించింది. సింగ్ తన విధులను నిర్వర్తించడానికి విస్తరించిన అన్ని ప్రభుత్వ సౌకర్యాలను జిల్లా యంత్రాంగం వెంటనే రద్దు చేయాలని ఈసీ పేర్కొంది.

2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అభిషేక్ సింగ్ గురువారం తన అధికారిక కారు ముందు ‘అబ్జర్వర్’ అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ చూపిస్తూ ఫొటో దిగాడు. ‘గుజరాత్ ఎన్నికలకు అబ్జర్వర్‌గా అహ్మదాబాద్‌లో చేరాను’ అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేశారు. తన సోషల్ మీడియా బయోలో ఐఏఏస్ అధికారిగా కాకుండా పబ్లిక్ సర్వెంట్, నటుడు , సామాజిక వ్యవస్థాపకుడిగా తనను తాను అభివర్ణించుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా , ట్విట్టర్‌లో 31,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మరియు ట్వీట్‌కు శుక్రవారం మధ్యాహ్నం నాటికి వరుసగా 27,000 మరియు 11,500 లైక్‌లు వచ్చాయి. వివరాలు బయటపెట్టడంతో ఇతడి వల్ల ఎన్నికల విధులు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇతడిని తొలగించి షాకిచ్చింది ఈసీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.