Begin typing your search above and press return to search.

ఆ ఏపీ ఐఏఎస్ అంత హాటా... ఎమ్మెల్యేల‌కే క్లాసులా?!

By:  Tupaki Desk   |   5 Aug 2022 5:27 AM GMT
ఆ ఏపీ ఐఏఎస్ అంత హాటా... ఎమ్మెల్యేల‌కే క్లాసులా?!
X
వైసీపీ అధికారంలో ఉంది. ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనేమాట‌.. ప్ర‌తిప‌క్షాల నుంచి త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. అయితే.. ఇది పాల‌నా ప‌రంగానే అయితే.. ఫ‌ర్వాలేదు. కానీ, పాల‌న‌కు మించి జ‌రుగుతుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఓ సీనియ‌ర్ ఐఏఎస్‌.... అది కూడా గ‌తంంలో టీడీపీ హ‌యాంలో చ‌క్రం తిప్పిన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అదికారి.. ఇప్పుడు ఎమ్మెల్యేల‌ను దారిలో పెడుతున్నార‌ట‌. అదేంటి? అనుకుం టున్నారా? అదే ఇప్పుడు చిత్రంగాను.. మ‌రింత హాట్ టాపిక్‌గాను మారింది.

వైసీపీ హ‌యాంలో చాలా మంది ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో అనేక మంది కాం ట్రాక్ట‌ర్లు ప‌నులు కూడా ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో వారితో ఎవ‌రుమాట్లాడాలి...? ఎమ్మెల్యేను ఎవ‌రు హెచ్చ‌రించాలి? కాంట్రాక్ట‌ర్ల నుంచి పార్టీకి ఒరిగే లాభం ఏంటి? వ‌ంటి అన్ని విష‌యాల‌ను స‌ద‌రు ఐఏఎస్ చూస్తున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఎవ‌రైనా స‌రే.. ఎంత‌టి వారైనా.. స‌రే.. స‌ద‌రు ఐఏఎస్ నుంచి పిలుపు వ‌స్తే.. ఆయ‌న ముందు మోక‌రిల్లాల్సిందేన‌ట‌.

మీరు స‌రిగా ప‌నిచేయ‌డం లేదు. మీ గ్రాఫ్ ప‌డిపోతోంది.. ఎందుకైనా మంచిది.. మీరు స‌రిచేసుకోండి.. అని స‌ద‌రు ఎమ్మెల్యేల‌ను హెచ్చరిస్తున్నార‌ట‌. పోనీ.. ఐఏఎస్ క‌దా.. ఆయ‌న చెబితే.. మేం ఎందుకు వినాలి అని అనుకునే ప‌రిస్థితి ఎమ్మెల్యేల‌కు లేదు.

ఎందుకంటే.. ముందుగా.. సీఎంవో కార్యాల‌యం నుంచి వారికి ఫోన్ వ‌స్తుంది. దాని ప్ర‌కారం వారు ముందుకు సాగాలి. సో.. ఇప్పుడు .. వారికి ఈ ఐఏఎస్ క‌ర్త‌కర్మ క్రియ గా మారిపోయార‌ట‌. సాక్షాత్తూ.. సీఎంతోనే సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న చెప్పింది విన‌క త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు.

ఇక‌, కాంట్రాక్ట‌ర్ల‌ను లైన్‌లో పెట్టుకునేందుకు కూడా.. ఈ ఐఏఎస్ నే వాడుకుంటున్నార‌ని అంటున్నారు. కాంట్రాక్ట‌ర్ల నుంచి వ‌సూలు చేసే మొత్తాల‌కు సంబంధించి.. వ్య‌వ‌హారం అంతా.. పొరుగు రాష్ట్రంలోనే చ‌క్క‌బెడుతున్నార‌ట‌. దీంతో వారు కూడా.. త‌ల‌కిందులు అవుతున్నారు. అయితే.. ఇలా ఐఏఎస్‌ను ఎందుకు వినియోగించుకుంటున్నారు ? అంటే..ఈయ‌న అటు టీడీపీకి కూడా చాలా ద‌గ్గ‌ర చుట్టంగా చెబుతున్నారు.

అంటే.. రేపు స‌ర్కారు మారినా.. టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. త‌మ చేతికి మ‌ట్టి అంట‌దు. ఎలాగూ.. త‌మ‌కు అయిన అధికారి కాబ‌ట్టి.. ఇప్పుడు ఆయ‌న ఏం చేసినా.. రేపు విచార‌ణ చేసే ధైర్యం .. టీడీపీ చేయ‌దు. సో.. ఉభ‌య కుశ‌లోప‌రిగా ఉంటుంద‌ని.. వైసీపీఅధిష్టానంఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్పగించింద‌ని అంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.