Begin typing your search above and press return to search.

నేను బతికే ఉన్నా .. క్లారిటీ ఇచ్చిన రెజ్లర్ !

By:  Tupaki Desk   |   11 Nov 2021 5:30 AM GMT
నేను బతికే ఉన్నా .. క్లారిటీ ఇచ్చిన రెజ్లర్ !
X
రెజ్లర్ నిషా దహియా .. తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తరపున రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీడియో విడుదల చేసింది. తనను, తన సోదరుడిని దుండగులు కాల్చి చంపినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని నేహా చెప్పారు. గోండాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు తాను వచ్చానన్నారు. తాను సురక్షితంగానే ఉన్నట్లు చెప్పారు.

అంతకు ముందు సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడెమీలో రెజ్లర్ నిషా దహియాను, ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. ఘటనలో నిషా తల్లి ధన్‌పాటి కూడా తీవ్రంగా గాయపడినట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే దీనిపై సోనిపట్ ఎస్పీ రాహుల్ శర్మ స్పందించారు. కాల్పుల ఘటన నిజమేనని అయితే కాల్పులు జరిపింది రెజ్లర్ నిషా దహియా కుటుంబంపై కాదని స్పష్టం చేశారు. గాయపడిన నిషా తల్లి ధన్‌పాటి రోహ్‌తక్‌లోని పీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, నిషా దహియా, ఆమె సోదరుడి మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం పంపార‌ని ప్ర‌చారం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ వార్తపై స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్ప‌ష్టం చేశారామె. నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్‌ న్యూస్‌.. ఆ వార్త నమ్మకండి'' అంటూ ఆమె ట్విట‌ర్‌లో వివ‌ర‌ణ ఇచ్చారు.

నిషా దహియా అండర్ 23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిషా దహియా ఘనతను అభినందించారు. 2014, 2015 సంవత్సారాల్లో వరుసగా నేషనల్ ఛాంపియన్ గా అవతరించింది నిషా దహియా. ఆసియా చాంపియన్ షిప్ లో కూడా కాంస్య పతకం సాధించింది.