Begin typing your search above and press return to search.
నాదల్ తో ఆటకు ఆశ పడుతున్న సానియా
By: Tupaki Desk | 4 Nov 2015 2:34 PM ISTఒక ఏడాది పది టైటిళ్లు సాధించి టాప్ సీడ్ గా దూసుకెళుతున్న టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ క్యాలెండర్ ఇయర్ లో డబుల్స్ లో ఇరగదీసిన సానియామీర్జా.. తాజాగా టైటిల్ సాధించిన ఉత్సాహంలో దేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఒక టీవీ ఛానల్ తో మాట్లాడారు. మహిళల డబుల్స్ లో మార్టినా హింగిస్ తో జత కట్టి.. తమ జంటకు తిరుగులేదని తేల్చేసిన సానియా.. ఇప్పుడు మిక్సెడ్ డబుల్స్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
మట్టి కోర్టుల రారాజు రఫెల్ నాదెల్ తో జత కట్టాలన్న తన కోరికను బయటపెట్టింది. అతడితో కలిసి ఆడాలన్న ఆశను ఆమె బయటపెట్టారు. మహిళా డబుల్స్ తో దుమ్ము రేపిన సానియా.. మిక్సెడ్ డబుల్స్ లోనూ భారీగా టైటిళ్లు కొల్లగొట్టాలన్నట్లుగా కనిపిస్తుందని చెబుతున్నారు. దీంతో పాటు.. రియో ఒలంపిక్స్ లో పతకం సాధించాలన్న కోరికను సానియా బయటపెట్టిన సంగతి తెలిసిందే. సానియ ఆశకు నాదెల్ ఎలా రియాక్ట్ అవుతాడో..?