Begin typing your search above and press return to search.

అభినందన్ దమ్ము ఎంతో చెప్పింది

By:  Tupaki Desk   |   16 Aug 2019 1:29 PM IST
అభినందన్ దమ్ము ఎంతో చెప్పింది
X
ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ సాహసం గురించి అందరికి తెలిందే అయినా.. దాన్ని ప్రత్యక్షంగా చూసిందెవరన్న విషయంపై సమాచారం బయటకు రాలేదు. తాజాగా దానికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. పంద్రాగస్టును పురస్కరించుకొని అభినందన్ వర్దమాన్ కు వీర్ చక్రను ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరొకరికి కూడా ఒక విశిష్ఠ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె.. స్క్రాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్.

యుద్ధ సమయంలో అత్యంత ధైర్య సాహసాల్ని ప్రదర్శించినందుకు ఆమెకు ఈ పురస్కారం అందించారు. విశేషం ఏమంటే.. ఈ అవార్డును పొందిన తొలి మహిళా రక్షణ అధికారి మింటీనే. పాక్ కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని అభినందన్ వర్దమాన్ కూల్చేసిన వైనాన్ని తాను తన కళ్లతో స్క్రీన్ మీద నుంచి చూసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో అభినందన్ కు తాను వాతావరణ పరిస్థితుల గురించి చెబుతున్నానని.. బాలాకోట్ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపిన తర్వాత శత్రువుల నుంచి రియాక్షన్ వస్తుందని భావించి.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

తమ అంచనాలకు తగ్గట్లే పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిందని.. అప్పటికే పైలెట్లు.. కంట్రోలర్లు.. ఇతరుల నుంచి గట్టి పోటీ ఎదురుకావటంతో వారి మిషన్ ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు. పాక్ కు చెందిన ఎఫ్ 16ను అభినందన్ కూల్చివేయటంలో మింటీ కూడా సహాయ సహకారాలు అందించారు.