Begin typing your search above and press return to search.

విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ !

By:  Tupaki Desk   |   7 May 2020 7:31 AM GMT
విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై మోదీ ఎమర్జెన్సీ మీటింగ్  !
X
విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖపట్నంలో పరిస్థితులకు సంబంధించి MHA NDMA అధికారులతో ఆయన మాట్లాడానన్నారు.అలాగే, కేంద్ర హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖతో ఆయన మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో ఉండే ప్రతీ ఒకరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఈ గ్యాస్ లీక్ నేపథ్యంలో ..ఈ ఘటన పై చర్చించేందుకు ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర విపత్తు నిర్వహణ శాఖతో ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఈ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆరా తీసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ లతో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. బాధితులకు మరింత మెరుగైన చికిత్స అందించాలని, విశాఖకు ఎన్టీఆర్ ఎఫ్ బృందాలను పంపాలని కిషన్‌ రెడ్డి సూచించారు. అలాగే కేంద్రం హోం మంత్రి అమిత్ షా ..ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసారు.

కాగా, మరోవైపు ఈ విషవాయువు దుర్ఘటనలో ఇప్పటివరకు 8మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. గోపాలపట్నం పరిధిలో ఐదు ప్రాంతాలకు చెందిన వందలాది ప్రజలు ఈ విషవాయువు పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన పై సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం సీఎం జగన్ విశాఖకు బయలుదేరారు. మరికాసేపట్లోనే విశాఖ చేరుకొని కేజీహెచ్ లో ఉన్న భాదితులని పరామర్శించనున్నారు.