Begin typing your search above and press return to search.

ద‌ర్జాగా క‌ల‌వొచ్చుగా..అంత గుట్టు ఎందుకు రాహుల్‌?

By:  Tupaki Desk   |   10 July 2017 9:16 PM IST
ద‌ర్జాగా క‌ల‌వొచ్చుగా..అంత గుట్టు ఎందుకు రాహుల్‌?
X
ఏ విష‌యాన్ని క‌వ‌ర్ చేసుకోవాలో.. ఏ అంశాన్ని క‌వ‌ర్ చేసుకోకూడ‌దో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి తెలిన‌ట్లుగా క‌నిపిస్తోంది. కీల‌క‌మైన అంశాల విష‌యంలో ఆయ‌న వేస్తున్న త‌ప్ప‌ట‌డుగులు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మార‌ట‌మే కాదు.. జాతి జ‌నుల ఆగ్ర‌హానికి గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది. డోక్లా స‌రిహ‌ద్దుల్లో కొద్ది రోజులుగా చైనా- భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు తెలిసిందే.

ఇదిలా ఉంటే.. చైనా రాయ‌బారితో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ భేటీ అయిన‌ట్లుగా చైనీస్ మీడియా పేర్కొంది. ఇదో సంచ‌ల‌నంగా మారింది. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న వేళ‌లో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు భేటీ కావ‌టం ఏమిట‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇదిలా ఉంటే.. చైనీస్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల్ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఖండించారు. దీంతో.. రాహుల్ భేటీ అయ్యారా? లేరా? అన్న‌ది సందేహంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూ మీద రాహుల్ రియాక్ట్ అయ్యారు. తాను చైనా అంబాసిడ‌ర్‌ ను క‌లిసిన‌ట్లుగా ఆయ‌న ట్విట్ట‌ర్‌ లో పేర్కొన్నారు. అయినా.. తన భేటీ మీద మోడీ స‌ర్కారు ఎందుకు రాద్దాంతం చేస్తుందో అర్థం కావ‌టం లేద‌న్న ఆయ‌న‌.. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న పార్టీ త‌ర‌ఫున భేటీ కావ‌టంలో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు.

స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న వేళ‌.. మోడీ స‌ర్కారుకు చెందిన ముగ్గురు మంత్రులు చైనా అతిధ్యాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖా మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఈ వారంలో చైనా ప‌ర్య‌ట‌న‌కు ఎందుకు వెళ్లారో చెప్పాల‌ని క్వ‌శ్చ‌న్ చేసిన రాహుల్.. జాతీయ స‌మ‌స్య‌ల వివ‌రాల్ని త‌మ‌కు చెప్ప‌టం క‌నీస ధ‌ర్మమ‌న్నారు. చైనా అంబాసిడ‌ర్ తో పాటు మాజీ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు.. ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ నాయ‌కులు.. భూటాన్ అంబాసిడ‌ర్ల‌ను తాను భేటీ అయిన‌ట్లుగా వెల్ల‌డించారు. వ‌రుస ట్వీట్ల‌తో అడ్డ‌గోలు వాద‌న‌ను వినిపిస్తున్న రాహుల్ మిస్ అయిన పాయింట్ ఏమిటంటే..చైనా అంబాసిడ‌ర్ తో రాహుల్ భేటీ కావొచ్చు. కానీ.. ఆ విష‌యాన్ని చైనీస్ మీడియానో.. చైనా విదేశాంగ శాఖో వెల్ల‌డించిన త‌ర్వాత బ‌య‌ట‌కు చెప్పే క‌న్నా.. ద‌ర్జాగా క‌లిస్తే త‌ప్పేముంది?

గుట్టుగా గుట్టు చ‌ప్పుడు కాకుండా ప‌నులు చ‌క్క‌బెట్టే అల‌వాటు రాహుల్‌ కు కొత్తేం కాదు. అయితే.. అదంతా ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశాల‌కు ప‌రిమిత‌మైతే ఓకే. జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల విష‌యంలో ఇలాంటి గుట్టు 130 కోట్ల భార‌తీయుల భ‌విష్య‌త్తు మీద ముడిప‌డి ఉంటుంద‌న్న విష‌యాన్ని రాహుల్ మ‌ర్చిపోవ‌టం ఏమిటి?