Begin typing your search above and press return to search.
మతోన్మాద మూక దాడి.. హిందువులను కడుపున పెట్టుకుని కాపాడిన ముస్లింలు
By: Tupaki Desk | 5 Nov 2020 5:20 PM ISTఇప్పుడు దేశాలు వేరు కావచ్చు కానీ.. పాకిస్తాన్ భారత్ ఒకప్పుడు ఒక దేశమేనని అందరికీ తెలిసిందే. మనది హిందూ దేశం అయినప్పటికీ జనాభాలో భారీ స్థాయిలో ముస్లింలు, క్రైస్తవులు తరతరాలుగా మనతోపాటే కలసి జీవిస్తున్నారు. స్వాతంత్రం వచ్చాక పాకిస్తాన్ వేరు దేశంగా మారు పడగా అక్కడి ప్రాంతంలోని వేలాది హిందూ కుటుంబాలు భారతదేశానికి తరలి వచ్చాయి. అయితే కొంత మంది మాత్రం ఇప్పటికీ అక్కడే మిగిలిపోయారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా పాకిస్తాన్ లో ఇప్పటికీ వారు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. పూర్తిగా ముస్లిం దేశం అయినప్పటికీ తమ సాంప్రదాయాలను, ఆచారాలు మర్చిపోకుండా హిందూ దేవుళ్లకు ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్లో అప్పుడప్పుడు హిందువుల పైన మత చాందస వాదులు దాడులు చేయడం జరుగుతూ ఉంటుంది.
కరాచీలోని శీతల్ కాంపౌండులో 300 హిందూ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాగా ఆదివారం వందలాది మంది ముస్లింలు గుంపుగా వచ్చి ఆ ప్రాంతంలోని హిందూ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ మూక హిందువుల పై కూడా దాడికి ప్రయత్నించింది. అయితే ఇదే ప్రాంతంలో హిందువులతో కలిసి జీవిస్తున్న 30 ముస్లిం కుటుంబాలు హిందువులపై దాడి జరగకుండా తీవ్రంగా ప్రతిఘటించాయి. ఆ ప్రాంతపు కాంపౌండ్ గేటు అడ్డుగా నిలబడి హిందువులు నివసించే ప్రాంతంలోకి ఆందోళనకారులను అడుగు కూడా పెట్టకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆ 60 కుటుంబాల హిందువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇటువంటి ఘటనలు మన దేశంలో కూడా గతంలో చాలా సందర్భాల్లో జరిగాయి. బొంబాయిలో ముస్లింల పై దాడి జరగకుండా హిందువులు అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ని అల్లర్లు చెలరేగినా అక్కడ నివసించే హిందువులను ముస్లింలు కాపాడుకుంటూ వస్తున్నారు.