Begin typing your search above and press return to search.

ఆదికి హైపర్‌ ఎక్కువైందా.?

By:  Tupaki Desk   |   21 Jan 2019 3:21 PM IST
ఆదికి హైపర్‌ ఎక్కువైందా.?
X
ఎవరి జీవితం వాళ్లది. కానీ రాజకీయాల్లోకి వచ్చాక స్వగత, వ్యక్తిగతాలుండావ్‌. ఓన్లీ.. విమర్శలు, పొగడ్తలే ఉంటాయి. ఇలాంటివి అన్నింటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే విజయ సాధించగలం. కానీ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న జబర్దస్త్‌ ఫేం ఆదికి ఇవన్నీ తెలీయలేదు.

రీసెంట్‌ గా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో జనసేన నిర్వహించిన ఓ సభకు ఆది వెళ్లాడు. ఆది వెళ్లడానికంటే ముందు.. అక్కడున్న నాయకులు వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్‌ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు జనసేన నిర్వహిస్తున్న సభలోనే జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అదే సమయానికి సభకి వచ్చిన హైపర్‌ ఆదిపై కారుపై రాళ్లు విసిరి అద్దాలను ధ్వంసం చేశారు.

దాడి తర్వాత సభలో ప్రసంగించిన ఆది తన పదునైన డైలాగ్స్‌ తో రెచ్చిపోయాడు. ఎన్నికలు జరిగే ఈ నాలుగు నెలలు జనసేనపై దాడులు చేసి గందరగోళం సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తుంటారని, అందువల్ల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కులపిచ్చితో కొందరు ఓట్లు వేస్తున్నారని, కానీ పవన్‌ లాంటి నిస్వార్థ నేతను ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నాడు ఆది. పవన్‌ కల్యాణ్‌ కు డబ్బు, పదవి పిచ్చిలేదని, కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పాడు. ఆది ప్రసంగానికి వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డు తగులుతూ జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో.. తన ప్రసంగాన్ని ముంగించేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆది. ఇప్పటివరకు హైపర్‌ ఆది చాలా సభల్లో ప్రసంగించాడు కానీ.. ఇలా జరగడం మాత్రం ఇదే తొలిసారి. ఇంకా ఎన్నికల హడావుడి మొదలవకముందే ఇలా ఉంటే.. నోటిఫికేషన్‌ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో మరి.