Begin typing your search above and press return to search.

మనమ్మాయిని అమెరికాలో రేప్ చేసి చంపేశారు

By:  Tupaki Desk   |   26 Nov 2019 4:33 PM IST
మనమ్మాయిని అమెరికాలో రేప్ చేసి చంపేశారు
X
మనమ్మాయి దారుణ హత్యకు గురైంది. అమెరికాలో తెలుగమ్మాయిని అత్యాచారం చేసి చంపిన వైనం సంచలనంగా మారింది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో చదువుతున్న పందొమ్మిదేళ్ల రూత్ జార్జ్ ను ఈ నెల 22న అత్యాచారం చేసి చంపినట్లుగా గుర్తించారు. కాస్త ఆలస్యంగా వెలుగు చేసిన ఈ వైనం షాకింగ్ గా మారింది. రూత్ జార్జ్ కుటుంబం 20 ఏళ్ల క్రితం చికాగోలో స్థిరపడింది. ఆమె ఇప్పుడు చదువుతోంది.

శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించట్లదేని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. వర్సిటీలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందుకున్న పోలీసులు తర్వాతి రోజున ఆమె డెడ్ బాడీని గుర్తించారు. వర్సిటీలోని క్యాంపస్ గ్యారేజ్ లో గుర్తించారు. ఆమె కారు వెనుక సీట్లోనే ఆమె అచేతనంగా పడి ఉంది.

ఆమె మరణానికి కారణం అత్యాచారంగా భావిస్తున్నారు. ఆమెను అత్యాచారం చేసి చంపేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె మరణానికి కారణం డొనాల్డ్ తుర్మాన్ గా గుర్తించారు. గతంలో ఇతడో చోరీ కేసులో ఆర్నెల్లు జైలుశిక్ష అనుభవించినట్లు పోలీసులు చెప్పారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేశారు. ఆమె తల్లిదండ్రులు 20 ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. ఏమైనా ఒక హైదరాబాదీని అంత దారుణంగా అత్యాచారం చేసి చంపేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.